మహిళా టీచర్ల హర్షం..
మహబూబాబాద్ అర్బన్: దేశంలో బాలికల విద్యకోసం ఎనలేని కృషి చేసిన సంఘసంస్కర్త, భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని జనవరి 3న మహిళా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం జీఓను విడుదల చేసింది. ప్రతీ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయల్లో జయంతి ఉత్సవాలు నిర్వహించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. కాగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మహిళా టీచర్లు, ఉద్యోగులు, బాలికలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏటా తప్పనిసరిగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment