ఆడపిల్లల చదువుల కోసం కష్టపడ్డారు..
మహిళలు, ఆడపిల్లల చదువుల కోసం సావిత్రిబాయి పూలే ఎంతగానో కష్టపడ్డారు. ఆరోజుల్లో తాను ఎన్నో అవమానాలు ఎదుర్కొని బాలికలు, మహిళల విద్య కోసం పాఠశాలలు నెలకొల్పారు. ఆమె స్ఫూర్తితో నేడు ప్రభుత్వాలు బాలికల కోసం ప్రత్యేక పాఠశాలలను స్థాపించాయి. ప్రభుత్వం ఆమె జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించడం ఆనందంగా ఉంది. ప్రభుత్వం ప్రతీ సంవత్సరం సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను నిర్వహించే విధంగా ప్రోత్సహించాలి.
– డోలి గిరిజ, ఉపాధ్యాయురాలు, జెడ్పీ
హెచ్‌ఎస్ బాలికల పాఠశాల మానుకోట
ప్రభుత్వ ప్రకటన అభినందనీయం
రాష్ట్ర ప్రభుత్వం సావిత్రి బాయి పూలే జయంతిని పురస్కరించుకొని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం అభినందనీయం. బాలికా విద్య కోసం సావిత్రిబాయి పూలే చేసిన కృషి మరువలేనిదని. బాలికల విద్యకోసం ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది.
– గండి రమాదేవి, స్కూల్ అసిస్టెంట్, జెడ్పీహెచ్‌ఎస్, నర్సింహులపేట
●
Comments
Please login to add a commentAdd a comment