విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలి
● కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్
మహబూబాబాద్ అర్బన్: విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ అన్నారు.జిల్లా కేంద్రంలోని బాలసందనం, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లను కలెక్టర్ శుక్రవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పలు సంక్షేమ హాస్టళ్లలో చదువుకుంటున్న విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలన్నారు. పిల్లలకు నాణ్యమైన భోజనం అందించాలని, ప్రత్యేక అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ పురుషోత్తం, జిల్లా అధికారులు నర్సింహస్వామి, వెంకటేశ్వర్లు, కిరణ్ కుమార్, మధుసూదన్‌రాజు, మరియన్న, కిరణ్, రాజేందర్‌ప్రసాద్, శివ భాస్కర్, లక్ష్మి, వీరన్న తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment