నిధులు విడుదల..
మహబూబాబాద్ అర్బన్: ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేశారు. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నారు. సైన్స్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ మార్కులు కూడా చాలా ముఖ్యం. కాగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రాక్టికల్స్ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఈ నిధులతో కెమిస్ట్రీ, బయాలజీ, ఫిజిక్స్ సబ్జెక్ట్‌లకు సంబంధించిన కెమికల్స్, పలు రకాల సామగ్రి కొనుగోలు చేయనున్నారు.
ఒక్కో కళాశాలకు రూ.25వేలు..
ఒక్కో ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు రూ.25వేల చొప్పున కళాశాల ఖాతాల్లో జమ చేశారు. ప్రయోగాలకు సంబంధించిన రసాయనాలు ఇతర సామగ్రి కొనుగోలు చేసి విద్యార్థులతో ప్రాక్టికల్స్ సక్రమంగా చేయించాలి. ఫిబ్రవరి 3నుంచి 25వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు కొనసాగుతాయి. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఇంగ్లిష్ సబ్జెక్ట్‌లో కూడా ప్రాక్టికల్స్ ఉంటాయి. అనంతరం నైతిక, మానవీయ విలువలు, పర్యావరణం పరీక్షలు ఉంటాయి. మార్చి 5నుంచి 22వరకు వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు.
ప్రాక్టికల్ పరీక్షకు హాజరుకానున్న
4,541మంది..
ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయి. ఇందులో మొత్తం 3,342 మంది విద్యార్థులు హాజరవుతారు. ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో 2305 మంది, ఒకేషనల్‌లో 1037మంది హాజరవుతారు. అలాగే ఒకేషనల్ మొదటి సంవత్సరం విద్యార్థులు 1199 మంది ప్రయోగ పరీక్షలకు హాజరుకానున్నారు. జనరల్ ప్రాక్టికల్స్‌కు 30 పరీక్ష కేంద్రాలు, ఒకేషనల్ పరీక్షలకు 16 కేంద్రాల్లో ఏర్పాట్లు చేస్తారు. మొదటి సెషన్ ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.
నిధులు ఖర్చు చేస్తారా..
జిల్లాలోని 10 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు ప్రాక్టికల్ పరీక్షల కోసం నిధులు విడుదలయ్యాయి. ఈ నిధులతో ప్రయోగ రసాయనాలు, సీసీ కెమెరాలు, ఇతర సామగ్రి కోనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ నిధులను ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాళ్లు, సైన్స్ అధ్యాపకులు సక్రమంగా ఖర్చు చేస్తారా లేదా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గైర్హాజరైతే ఫెయిల్ అయినట్లే..
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు రాసే విద్యార్థులు హాల్ టికెట్‌లో ఉన్న సమయానికి 30 నిమిషాల ముందే కేంద్రాలకు చేరుకోవాలి. ఈ పరీక్షలకు గైర్హాజరైన విద్యార్థులు ఫెయిల్ అయినట్టే. విద్యార్థులకు తమ కళాశాల ఉపాధ్యాయులు ఒకటికి రెండుసార్లు చెప్పాలి. నిమిషం అలస్యం వస్తే విద్యార్థులకు అనుమతి లేదు.
– సీహెచ్.మదార్‌గౌడ్, డీఐఈఓ
ఫిబ్రవరి 3నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు
ఫస్టియర్‌లో 1199 మంది విద్యార్థులు
సెకండియర్‌లో 3,342మంది
మార్చి 5 నుంచి వార్షిక పరీక్షలు
Comments
Please login to add a commentAdd a comment