సీ్త్ర విజయానికి పురుషుడు అండగా నిలవాలి
హన్మకొంండ అర్బన్ : సీ్త్రలు విజయం సాధించేలా పురుషుడు వారికి అండగా నిలవాలని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ చేతన్ శ్రీవాత్సవ పేర్కొన్నారు. వరంగల్‌లోని పింగిళి మహిళా కళాశాలలో ‘ఫైనాన్సియల్ లిటరసీ అండ్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఇండియా చాలెంజస్ అండ్ అపర్చునిటీస్ ’అనే అంశంపై రెండోరోజుల పాటు నిర్వహించిన జాతీయ సదస్సు శుక్రవారం ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ చంద్రమౌళి అధ్యక్షత వహించగా ప్రొఫెసర్ చేతన్ శ్రీవాత్సవ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ చేతన్ శ్రీవాత్సవ మాట్లాడుతూ.. దేశానికి ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ సమర్థవంతంగా నిర్వహిస్తూ, మహిళా ఆర్థిక సాధికారతకు నిదర్శంగా నిలుస్తారన్నారు. ఈ సదస్సుకు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి 196 పరిశోధన పత్రాలు రావడం గర్వకారణమని తెలిపారు. పరిశోధన పత్రాలు సమర్పించిన అందరికీ అతిథుల చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందించారు. కార్యక్రమంలో ఎన్‌ఐటీ ప్రొఫెసర్ ఆనంద్ కిషోర్, కేడీసీ ప్రిన్సిపాల్ జి.రాజారెడ్డి, సెమినార్ ఆర్గనైజింగ్ సెక్రటరీ జి.రాజు, సదస్సు కన్వీనర్, కామర్స్ విభాగాధిపతి సారంగపాణి, బోధన, బోధనేతర సిబ్బది, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రొఫెసర్ చేతన్ శ్రీవాత్సవ
పింగిళిలో ముగిసిన జాతీయ సదుస్సు
Comments
Please login to add a commentAdd a comment