తెలుగు విభాగం అధిపతి, బీఓఎస్ నియామకానికి కమిటీ
● సీనియారిటీ తేల్చి రిపోర్టు ఇవ్వాలని ఆదేశాలు
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ తెలుగు విభాగం అధిపతి, బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ప్రొఫెసర్ ఏ టూరు జ్యోతి ఇటీవల మృతిచెందారు. అయితే ఆ విభాగంలో ఇక రెగ్యులర్ ప్రొఫెసర్లు లేకపోవడంతో నలుగురు కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు పని చేస్తున్నారు. తెలుగు విభాగం అధిపతిగా, బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్‌గా తమను నియమించాలని నలుగురు కూడా యూనివర్సిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పరస్పర ఆరోపణలతో వినతిపత్రాలు అందజేశారు. వాస్తవంగా సీనియారిటీ ప్రాతిపదికన నియమించాల్సి ఉంటుంది. ఆరోపణలతో పాటు తమకే పదవులు ఇవ్వాలని న లుగురు ఆశిస్తుండటంతో వీసీ ప్రొఫెసర్ ప్రతాప్‌రెడ్డి ఆదేశాల మేరకు రెండ్రోజుల క్రితం కేయూ రిజిస్ట్రార్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ప్రొఫె సర్ పి.మల్లారెడ్డితో (ప్రస్తుతం మాజీ రిజిస్ట్రార్) కూడిన కమిటీని ని యమించారు.ఈ కమిటీ చైర్మన్‌గా కేయూ సోషల్ సైన్స్ డీన్ ప్రొఫెసర్ టి.మనోహర్, సభ్యులుగా యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్, ఆర్ట్స్ డీన్‌గా బాధ్యతలను నిర్వర్తిస్తున్న ఆచార్య బి.సురేష్ లాల్, దూర విద్యా కేంద్రం డైరెక్టర్, సీడీసీ డీన్‌గా బాధ్యతలను నిర్వర్తిస్తున్న ప్రొఫెసర్ రామచంద్రంను (ప్రస్తుతం రిజిస్ట్రార్) నియమించా రు. కన్వీనర్‌గా టీచింగ్ విభాగం అసిస్టెంట్ రిజిస్ట్రార్ ప్రణయ్‌కుమార్‌ను నియమించారు. ఈ కమిటీ తెలుగు విభాగంలో పనిచేస్తున్న నలు గురు కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లలో ఎవరు సీనియర్‌గా ఉన్నారు. ఎవరిని విభాగం అధిపతిగా, బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్‌గా నియమించాలనేది పరిశీలించి రిపోర్టు ఇవ్వాలని రిజిస్ట్రార్ జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వారం రోజుల్లో రిపోర్టు ఇవ్వాల్సింటుంది. అయితే రిజిస్ట్రార్ మల్లారెడ్డి పదవీకాలం ముగిసింది. దూరవిద్యాకేంద్రం డైరెక్టర్‌గా ఉన్న రామచంద్రం రిజిస్ట్రార్‌గా బాధ్యతలను స్వీకరించారు. ఫిబ్రవరి 1న ఈ కమిటీ సమావేశమై పరిశీలించే అవకాశాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment