No Headline
హన్మకొండ : మాదిగలకు తమ మద్దతు అంటూనే, మాలలను సీఎం రేవంత్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య విమర్శించారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కమిటీల పేరుతో ఎస్సీ వర్గీకరణను కాలయాపన చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు చేవెళ్లలో ప్రకటించిన ఎస్సీ డిక్లరేషన్‌లో ఎస్సీ వర్గీకరణ ప్రకటిస్తామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ప్రకటించారని, అగ్రనేత రాహుల్ కూడా ఎన్నికల సభల్లో ప్రకటించారని గుర్తు చేశారు. దీంతోపాటు 2023, ఆగష్టు 1న సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసరం ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చని తీ ర్పు ఇచ్చిన క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి దేశంలోనే అన్ని రాష్ట్రాలకంటే ముందుగా తెలంగాణలో అమలు చేస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పినా ఆరు నెలలుగా తాత్సారం చేస్తూ వస్తున్నారని తూర్పారబట్టా రు. మల్లికార్జున ఖర్గే మాల వర్గానికి చెందిన వార ని, మరో వైపు వివేక్ వెంకటస్వామి కుటుంబం, మ రో వైపు మల్లు బ్రదర్స్ నుంచి ఒత్తిడితో ఎస్సీ వర్గీకరణపై నిర్ణయం తీసుకుంటే పదవికి ముప్పు వస్తుందని వెనుకడుగు వేస్తున్నారన్నారు. సమావేశంలో జెడ్పీ మాజీ చైర్మన్ మారపల్లి సుధీర్ కుమార్, నా యకులు సోదా కిరణ్, మేకల అనిత, మేకల బాబు రావు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచ్‌లు, బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే డాక్టర్
తాటికొండ రాజయ్య
Comments
Please login to add a commentAdd a comment