బాల కార్మికులను ఇంటికి పంపిస్తాం
మహబూబాబాద్: బాలసదనంలో ఉన్న బాలకార్మి కులను ఇంటికి పంపిస్తామని జిల్లా సంక్షేమాధికారి దనమ్మ అన్నారు. సీడబ్ల్యూసీ నిర్వాకంతో బాలసదనంలో నెలల తరబడి బాలకార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈమేరకు సోమవారం సాక్షి దినపత్రికలో ‘సమన్వయం లోపం!’ అనే శీర్షికన వెలువడిన కథనంపై జిల్లా సంక్షేమాధికారి దనమ్మ స్పందించారు. ఈమేరకు జిల్లా సంక్షేమాధికారి కార్యాలయంలో డీడబ్ల్యూఓ దనమ్మ అధ్యక్షతన సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్ డాక్టర్ నాగవాణి, సభ్యులు డేవిడ్, డాక్టర్ పరికిపండ్ల అశోక్, బాలల పరిరక్షణ విభాగం, చైల్డ్‌లైన్ విభాగం అధికారులతో సమావేశం నిర్వహించారు. డీడబ్ల్యూఓ కొన్ని గంటల పాటు విచారణ చేశారు. వారినుంచి నివేదికలు తీసుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీడబ్ల్యూసీ కమిటీ మూడేళ్ల పదవీకాలం కూడా ముగిసిందని, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి నూతన కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ రాజు తదితరులు పాల్గొన్నారు.
త్వరలోనే నూతన సీడబ్ల్యూసీ ఏర్పాటు
విచారణ చేపట్టిన డీడబ్ల్యూఓ దనమ్మ
Comments
Please login to add a commentAdd a comment