రైతుల సమస్యలకు వాట్సా్‌ప్‌లో సలహాలు
వరంగల్ : వాట్సాప్ గ్రూపుల ద్వారా రైతులకు వివిధ పంటల సాగులో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి సలహాలు ఇస్తున్నట్లు ‘ఫాస్’ (ఫౌండేషన్ ఫర్ అగ్రికల్చర్ సస్టేనబిలిటీ ట్రాన్స్‌ఫ్మారేషన్) వేదిక అధ్యక్షుడు రామచంద్రమూర్తి తెలిపారు. మంగళవారం జిల్లా రైతు శిక్షణ సమావేశ మందిరంలో ఫాస్ట ఐదేళ్ల విజయోత్సవ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఫాస్ట్’ వేదిక ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రైతులకు సందర్భానుసారంగా సలహాలు, సూచనలు చేరవేస్తున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వరంగల్ సహా సంచాలకుడు ఉమారెడ్డి, వ్యవసాయ కళాశాల ప్రిన్సిపాల్ బలరాం, అస్కి ప్రతినిధి హేమనాథరావు, ఫాస్ట్ ప్రతినిధి రామచందర్‌రావు, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ గౌస్‌హైదర్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment