● వీసీలో సీఎస్ శాంతికుమారి
మహబూబాబాద్: నేటి నుంచి నాలుగు నూతన పథకాలు అమలు చేయనున్నట్లు సీఎస్ శాంతికుమారి తెలిపారు. శనివారం హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్‌తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా శాంతికుమారి మాట్లాడుతూ ప్రతీమండలంలోని ఒక గ్రామంలో పథకాలు ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. పథకాల ప్రారంభోత్సవం పండుగ వాతావరణంలో జరగాలన్నారు. సీఎం సందేశాన్ని ప్రతీ గ్రామంలో ప్రదర్శించాలన్నారు. వీసీలో కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్, అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, కె. వీరబ్రహ్మచారి, మండల ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.
ఓటు హక్కు వజ్రాయుధం
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధమని, 18 సంవత్సరాలు నిండిన ప్రతీఒక్కరు ఓటరుగా నమోదు చేసుకొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓటరు ప్రతిజ్ఞ కార్యక్రమంతో పాటు ప లు కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడా రు. ఓటు హక్కు ప్రాధాన్యతను గుర్తించాలని, ప్రతీఒక్కరు ఓటు హక్కుపై అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, వీరబ్రహ్మచారి, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment