అగ్రవర్ణ పేదల రిజర్వేషన్ ఎత్తివేసే కుట్ర
కాజీపేట అర్బన్ : అగ్రవర్ణ పేదల రిజర్వేషన్ ఎత్తివేసే కుట్రతో హనుమకొండలో జరిగిన కుల సంఘాల సమావేశంలో కొందరు గిట్టని వ్యక్తులు ఓసీ ప్రజలను పరుషపదజాలంతో దూషించడం వారి అవగాహన రాహిత్యానికి నిదర్శనమని ఓసీ సంఘాల నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం హనుమకొండ పోస్టల్ కాలనీలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తోట సురేశ్ అధ్యక్షతన నిర్వహించిన అత్యవసర సమావేశంలో రాష్ట్ర రెడ్డి సంఘాల అధ్యక్షుడు గోపు జైపాల్‌రెడ్డి, రాష్ట్ర కమ్మ సంఘం ప్రధాన కార్యదర్శి గంగవరంపు రామకృష్ణ ప్రసాద్, వెలమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి పాపారావు, బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ సత్యమోహన్ మాట్లాడారు. అగ్రవర్ణ పేదల రిజర్వేషన్ రద్దు చేయాలనడం రాజ్యాంగాన్ని అవమాన పరచడమేనన్నారు. ఓసీలోని నిరుపేదలకు లబ్ధి చేకూర్చేందుకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ 2019లో అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్ కల్పించారన్నారు. సుప్రీం కోర్టు కూడా అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ కల్పించాలని తెలపడం ద్వారా ఎంతో మందికి లాభం చేకూరిందన్నారు. ఈ రిజర్వేషన్లను తట్టుకోలేక కొంత మంది తరచూ ప్రతి సభలో రెడ్డి, వెలమ, ఇతర సామాజిక వర్గాలను టార్గెట్ చేస్తూ సొంత భాషలో మాట్లాడడం సరికాదన్నారు. కార్యక్రమంలో జైహింద్‌రెడ్డి, నల్ల సంజీవరెడ్డి, వెంకటరెడ్డి, గంగిడి ప్రభాకర్‌రెడ్డి, ఈసం రమణారెడ్డి, గొంది జగన్మోహన్‌రెడ్డి, కట్కూరి హనుమంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఓసీ సంఘాల నాయకులు
జైపాల్‌రెడ్డి, రామకృష్ణ ప్రసాద్,
పాపారావు, సత్యమోహన్
Comments
Please login to add a commentAdd a comment