పంటక్షేత్రాల్లో పసిప్రాయం..
ఏటూరునాగారం: ఎన్ని చట్టాలు వచ్చినా.. ఎన్ని పథకాలు ఉన్నా బాలల జీవితాలు మారడం లేదు. సంబంధిత అధికారులు పర్యవేక్షణ కొరవడంతో పుస్తకాలు పట్టుకుని పాఠశాలకు వెళ్లాల్సిన చిన్నారులు ఇప్పటికీ కొన్ని చోట్ల ఏదో పని చేస్తూనే ఉ న్నారు. దీనికి నిదర్శనమే ఈ ఘటన. ములుగు జి ల్లా ఏటూరునాగారం, మంగపేట, తాడ్వాయి, కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం(కె) మండలాల్లో మిరప తోటలు సాగవుతున్నాయి. ఈ క్రమంలో మిరపకాయలు ఏరేందుకు పొరుగు రాష్ట్రం ఛత్తీస్‌గఢ్ నుంచి 12 ఏళ్ల బాలబాలికలు వచ్చారు. అలాగే, ములుగు జిల్లా ఏజెన్సీ మండలాల్లో అటవీప్రాంతంలో నివాసముంటున్న గొత్తికో యగూడేల నుంచి బడీడు పిల్లలు మిర్చి కోతలకు వెళ్లడం గమనార్హం. బాలలను సంరక్షణ కోసం ఏ ర్పాటు చేసిన ఇంటిగ్రేడెట్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీం(ఐసీపీఎస్), ఐసీడీఎస్ అధికారుల తనిఖీలు, పర్యవేక్షణ పూర్తిగా కరువవ్వడంతో కొంత మంది ముఠాగా ఏర్పడి చిన్నారులను మిర్చి కోతలకు తరలిస్తున్నారు. దీంతో పసిమొగ్గల జీవితాలు ఏజెన్సీలోని మిర్చి తోటల్లో మసకబారిపోతున్నాయి. ఇప్పటికై నా అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి బడీడు పిల్లలను రక్షించాలని ప్రజలు కోరుతున్నారు.
మిర్చితోటల్లో కూలీ పనులు చేస్తున్న బాలలు
పట్టించుకోని ఐసీపీఎస్, ఐసీడీఎస్ అధికారులు
Comments
Please login to add a commentAdd a comment