![రోప్ వే సర్వీస్ ప్రొవైడర్లకు సూచనలు ఇస్తున్న మంత్రి - Sakshi](/styles/webp/s3/article_images/2023/03/16/15mbnrl102-210148_mr_0.jpg.webp?itok=0mu3bdec)
రోప్ వే సర్వీస్ ప్రొవైడర్లకు సూచనలు ఇస్తున్న మంత్రి
● మంత్రి శ్రీనివాస్‌గౌడ్
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన మన్యంకొండలో రోప్‌వేను నిర్మించనున్నట్లు రాష్ట్ర ఎకై ్సజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌అన్నారు. ఈ మేరకు మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో రోప్‌వే సర్వీస్ ప్రోవైడర్లతో మంత్రి సమావేశమయ్యారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. రోప్ వే వల్ల మన్యంకొండ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. దేశంలో వివిధ రాష్ట్రాల పర్యాటక ప్రదేశాల్లో నిర్మించిన పలు రోప్ వే డిజైన్లను మంత్రి పరిశీలించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలని సూచించారు. తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో పర్యాటక ప్రదేశాల్లో ఆధునిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. దేశ విదేశాల్లో తెలంగాణ ప్రధాన పర్యాటక కేంద్రాలకు ప్రచారం నిర్వహిస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment