![ప్రజావాణికి 142 దరఖాస్తులు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/0000635000-000001-navathaadverti_mr-1739221479-0.jpg.webp?itok=InnNvO33)
ప్రజావాణికి 142 దరఖాస్తులు
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ప్రజావాణి కార్య క్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను సత్వ రం పరిష్కరించాలని కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని మీటింగ్‌హాల్ నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, మోహన్‌రావులతో కలి సి ఆమె ప్రజలను సుంచి దర ఖాస్తులు స్వీకరించా రు. ఈ వారం 142 అర్జీలు అందాయని కలెక్టర్ పేర్కొన్నారు. వీటిని పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని సంబంధిత జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో రెవెన్యూ, సర్వే ల్యాండ్ రికార్డ్స్, డీఆర్‌డీఏ ఇతర శాఖలకు సంబంధించిన దరఖాస్తులు అందాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ కేవీవీ రవికుమార్, డీఆర్‌డీఓ నర్సింహులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment