![No Headline](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/11mbnrl51-600510_mr-1739301718-0.jpg.webp?itok=JwYHlagR)
No Headline
స్టేషన్ మహబూబ్‌నగర్: జిల్లాకేంద్రం సింహగిరిలోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం ఉదయం 5.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు సుప్రభాత నిత్యోత్సవం, చతుస్థానార్చనలు, మూలమంత్ర హవనం, పూర్ణాహుతి పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. రాత్రి గరుడవాహనంపై స్వామివారిని ఊరేగించారు. కల్యాణోత్సవంలో స్వామివారికి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి పాల్గొని, పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామివారి కల్యాణ వేడుకల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. రాబోయే రోజుల్లో దేవాలయం ఆవరణలో భక్తులకు అన్ని రకాల వసతులు కల్పిస్తామన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రథోత్సవం, గురువారం అష్టోత్తర కలశాభిషేకం, చక్రతీర్థం, మహాకుంభప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆయా కార్యక్రమాల్లో ఆలయ సుందరీకరణ కమిటీ అధ్యక్షుడు పోల శ్రీనివాస్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, నాయకులు సిరాజ్‌ఖాద్రీ, రాఘవేందర్, సుధాకర్‌రెడ్డి, శ్రీనివాస్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment