మన్యంకొండ జాతరకు భారీ భద్రత: ఎస్పీ
మహబూబ్‌నగర్ క్రైం: మన్యంకొండ శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను శాంతియుతంగా నిర్వహించడానికి 400మంది పోలీస్ సిబ్బందితో భారీ భద్రత ఏర్పాటు చేశామని, ప్రధానంగా నేడు (బుధవారం)రథోత్సవం నేపథ్యంలో ప్రత్యేక నిఘా ఉంటుందని డి.జానకి అన్నారు. భద్రత ఏర్పాట్లు, పోలీస్ బందోబస్తుపై మంగళవారం అలివేలు మంగమ్మ ఆలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో సిబ్బందికి సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తుల కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సిబ్బంది పూర్తిగా అప్రమత్తంగా ఉండాలన్నారు. భక్తులతో మర్యాదపూర్వకంగా మాట్లాడటం, దొంగతనాలు జరగకుండా మఫ్టీలో ఉన్న సిబ్బంది ప్రతి ఒక్కరిని గమనించాలన్నారు. హోంగార్డుల నుంచి అదనపు ఎస్పీ వరకు విధుల్లో ఉంటారని, భక్తులు పెద్ద సంఖ్యలో ఉండే ప్రాంతాల్లో పోలీస్ సిబ్బంది అధికంగా విధుల్లో ఉండాలన్నారు. ఆలయ ప్రాంగణం, భక్తుల ప్రవేశ ప్రాంతా ల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా పెంచా లన్నారు. మహిళ భక్తుల భద్రత కోసం ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీలు రాములు, సురేష్‌కుమార్, డీఎస్పీలు వెంకటేశ్వర్లు, గిరిబాబు, రమణారెడ్డి, సుదర్శన్, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment