![హనుమత](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/m7_mr-1739301717-0.jpg.webp?itok=ysxcuRIu)
హనుమత్ వాహనంపై స్వామివారు
మహబూబ్‌నగర్ రూరల్: మన్యంకొండ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి హనుమత్ వాహనసేవ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శోభాయమానంగా అలంకరించిన హనుమత్‌వాహనంపై స్వామివారిని గర్భగుడి నుంచి దేవస్థానం ముందు ఉన్న మండపం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. సన్నాయి వాయిద్యాలు, పురోహితుల వేదమంత్రాలు, భక్తుల హరినామస్మరణ మధ్య స్వామివారి సేవ ముందుకు కదిలింది. బంగారు ఆభరణాలు, వివిధ రకాల పూల అలంకరణల మధ్య స్వామివారు భక్తకోటికి దర్శనమిచ్చారు. అనంతరం ప్రభోత్సవం వైభవంగా సాగింది. ఈ వేడుకను తిలకించేందుకు వేలాది మంది భక్తులు హాజరయ్యారు. ఉదయం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారికి దాసంగాలు పెట్టి మొక్కులు తీర్చకున్నారు. కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ అళహరి మధుసూదన్‌కుమార్, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందాచారి పాల్గొన్నారు.
● బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన స్వామివారి రథోత్సవం బుధవారం అర్ధరాత్రి తర్వాత 2 గంటలకు రథోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగాస్వామివారిని గరుడ వాహనంపై తేరుమైదానానికి తీసుకొస్తారు. ఈ వేడుక కోసం ఘనంగా ఏర్పాట్లు చేశారు.
వైభవంగా సాగిన శ్రీనివాసుడి ప్రభోత్సవం
నేడు గరుడవాహన సేవ, రథోత్సవం
![హనుమత్ వాహనంపై స్వామివారు 1](https://www.sakshi.com/gallery_images/2025/02/12/m5_mr-1739301717-1.jpg)
హనుమత్ వాహనంపై స్వామివారు
Comments
Please login to add a commentAdd a comment