![పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధం కావాలి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/11mbnrl104-210148_mr-1739301717-0.jpg.webp?itok=b0s8VSbS)
పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధం కావాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని మీటింగ్‌హాల్‌లో హన్వాడ, గండేడ్, సీసీ కుంట, మూసాపేట, కోయిల్‌కొండ, నవాబుపేట, కౌకుంట్ల, మహమ్మదాబాద్ మండలాలరే సంబంధించి గ్రామ పంచాయతీ ఎన్నికలకు నియమించిన స్టేజ్–1 ఆర్‌ఓ, ఏఆర్‌ఓ, స్టేజ్–2 ఆర్‌ఓలకు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల కోసం ముందస్తుగానే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని సూచించారు. ఎలాంటి వివాదాలు, తప్పిదాలకు తావులేకుండా నిబంధనలను తప్పకుండా పాటిస్తూ ఎన్నికల విధులను జాగ్రత్తగా నిర్వర్తించాలని సూచించారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారులు క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల కమిషన్ ప్రకటన అనుసరిస్తూ నోటిఫికేషన్ జారీ, నామినేషన్ ప్రక్రియ నిర్వహించాలన్నారు.
మాస్టర్ ట్రైనర్లు అవగాహన కల్పించాలి
జెడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలకు మాస్టర్ ట్రైనర్లు ఎన్నికల సిబ్బందికి నిబంధనలపై అవగాహన కల్పించాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. జెడ్పీ సమావేశ మందిరంలో మాస్టర్ ట్రైనర్లకు ఎన్నికల నిర్వహణపై శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు నోడల్ అధికారులు, ఆర్‌ఓ, ఏఆర్‌ఓలను పంచాయతీ ఎన్నికల కోసం నోడల్ అధికారులు, స్టేజ్–1 ఆర్‌ఓ, ఏఆర్‌ఓ, స్టేజ్–2 ఆర్‌ఓలను నియమించినట్లు పేర్కొ న్నారు. శిక్షణ కార్యక్రమాలు ఈనెల 15 లోగా పూర్తి చేయాలన్నారు. మాస్టర్ ట్రైనర్లు పోలింగ్ సిబ్బందికి మండలస్థాయిలోనే శిక్షణ నిర్వహించాలని సూచించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనలు, హ్యాండ్ బుక్ క్షుణ్ణంగా చదివి ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలని అన్నారు. అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, జెడ్పీ సీఈఓ వెంకటరెడ్డి, డీఈఓ ప్రవీణ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న కలెక్టర్ విజయేందిర
Comments
Please login to add a commentAdd a comment