![ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10zcl01-210041_mr-1739221479-0.jpg.webp?itok=Kd_M2aE0)
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి
జడ్చర్ల: ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామని ఎస్పీ జానకి అన్నారు. సోమవారం జడ్చర్ల రూరల్ పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలపై ఎస్పీని కలిసి విన్నవించారు. ప్రధానంగా భూ వివాదాలు, కుటుంబ గొడవలు, మహిళల భద్రత, నేర నియంత్రణ తదితర అంశాలపై 11 మంది ఫిర్యాదు చేశారు. వచ్చిన ఫిర్యాదులను అప్పటికప్పుడే ఎస్పీ విచారించి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మహిళల భద్రతపై పోలీస్ శాఖ ప్రత్యేకంగా దృష్టిసారించిందని, ఎక్కడైనా వేధింపులకు గురైతే వెంటనే 100 డయల్‌కు లేదా సెల్ నం.87126 59365కు ఫోన్ చేసి చెప్పాలన్నారు. అలాగే షీటీం, మహిళా పోలీస్ విభాగం ప్రత్యేకంగా ఉన్నాయన్నారు. పోలీస్ శాఖ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషిచేస్తుందన్నారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో రూరల్ సీఐ నాగార్జునగౌడ్, టౌన్ సీఐ ఆదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment