![తగ్గన](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/11022025-mnd_tab-01_subgroupimage_1883337616_mr-1739221478-0.jpg.webp?itok=2GkEQd6D)
తగ్గనున్న 19 పంచాయతీలు
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): జిల్లాలో గ్రామ పంచాయతీలు తగ్గనున్నాయి. ప్రస్తుతం 441 గ్రామ పంచాయతీ ఉండగా ఆ సంఖ్య 423కి చేరింది. ఇందులో మొత్తం 19 గ్రామ పంచాయతీలు మహబూబ్‌నగర్ కార్పొరేషన్, దేవరకద్ర మున్సిపాలిటీ, ఇతర మండలాల్లో విలీనమయ్యాయి. మహబూబ్‌నగర్ రూరల్ మండలంలోని దివిటిపల్లి, జైనల్లీపూర్ గ్రామాలు మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌లో విలీనమయ్యాయి. దీంతోపాటు దేవరదక్ర, చౌదర్‌పల్లి, పెద్దగోప్లాపూర్, బల్సుర్‌పల్లి, మీనుగోనిపల్లి గ్రామాలు కలుపుకొని దేవరకద్ర మున్సిపాలిటీగా ఏర్పడింది. ఇక జడ్చర్ల నియోజకవర్గంలోని నవాబ్‌పేట మండలంలో ఏకంగా 12 గ్రామ పంచాయతీలు కొత్తగా ఏర్పడిన చౌడాపూర్ మండలంలోకి వెళ్లాయి. ఇందులో మరికల్, అగ్రహారం, కిష్టాయపల్లి, మల్కాపూర్, కొత్తపల్లి, కొత్తపల్లితండా, బొంగరంపల్లి, లింగనపల్లి, పురుషంపల్లి, కంమన్‌పల్లి, చిన్నమేగ్యతండా, చాకల్‌పల్లి, నసీర్‌సాబ్‌తండా పంచాయతీలు ఉన్నాయి. ఈ 12 గ్రామాలు వికారాబాద్ జిల్లాలోకి వెళ్లాయి.
కొత్తగా ఏవీఆర్‌కాలనీ పంచాయతీ..
జిల్లాలో కొత్తగా భూత్పూర్ మండలంలోని ఏవీఆర్ కాలనీ గ్రామపంచాయతీ కొత్తగా ఏర్పడింది. త్వరలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో ఈ గ్రామానికి సైతం ఎన్నికలు జరుగుతాయి.
జిల్లాలో 423కి చేరిన గ్రామాల సంఖ్య
వికారాబాద్ జిల్లాలోకి 12 గ్రామాలు
![తగ్గనున్న 19 పంచాయతీలు 1](https://www.sakshi.com/gallery_images/2025/02/11/village2_mr-1739221478-1.jpg)
తగ్గనున్న 19 పంచాయతీలు
Comments
Please login to add a commentAdd a comment