బోయిన్‌పల్లిలో మాట్లాడుతున్న మందకృష్ణ మాదిగ
మహబూబ్‌నగర్: ఎస్సీ వర్గీకరణతోనే మాదిగలకు న్యాయం చేకూరుతోందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. పార్లమెంట్‌లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టి ఆమోదించాలని డిమాండ్ చేస్తూ అలంపూర్ నుంచి నుంచి చేపట్టిన పాదయాత్ర సోమవారం మిడ్జిల్ మండలం బోయిన్‌పల్లికి చేరింది.
ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడుతూ తాము ఏ పార్టీకి అనుకూలం కాదని, ఎస్సీ వర్గీకరణే ముఖ్యమన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎమ్మార్పీఎస్ కేసీఆర్‌కు అండగా నిలిచిందని, మంత్రి వర్గంలో ఎస్సీలకు చోటు కల్పించకపోవడం దారుణమన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన మాదిగలకు మంత్రి పదవి ఇవ్వలేదని, ఇతర కులాల వారు మొదటిసారి గెలిస్తే మంత్రి పదవి కట్టబెట్టారని విమర్శించారు.
తాము ఉద్యమాలు చేయడం వల్ల ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం కమిషన్ వేసి నివేదికలు తెప్పించుకున్నా నేటి వరకు బిల్లుకు ఆమోదం తెలుపకపోవడం బాధాకరమని అన్నారు. నవంబర్‌లో నిర్వహించనున్న పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెట్టి ఆమోదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment