డీసీసీబీ సీఈఓగాపురుషోత్తంరావు | - | Sakshi
Sakshi News home page

డీసీసీబీ సీఈఓగాపురుషోత్తంరావు

Published Sat, Sep 7 2024 1:32 AM | Last Updated on Sat, Sep 7 2024 1:32 AM

డీసీస

మహబూబ్‌నగర్‌ (వ్యవసాయం): జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) ముఖ్య కార్యనిర్వహణాధికారిగా జనరల్‌ మేనేజర్‌ పురుషోత్తంరావుకు శుక్రవారం బాధ్యతలు అప్పగించారు. ఇప్పటి వరకు సీఈఓగా ఉన్న లక్ష్మయ్యను రుణమాఫీ విషయంలో సస్పెన్షన్‌ వేటు వేసిన విషయం తెలిసిందే. జీఎంగా ఉన్న పురుషోత్తంరావు సీఈఓగా బాధ్యతలు అప్పగించడంతో ఆయన విధుల్లో చేరారు. గతంలో కూడా ఆయన జీఎంగా విధులు నిర్వహిస్తూనే సీఈఓగా కొన్నాళ్లు పనిచేశారు.

దరఖాస్తుల ఆహ్వానం

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: జిల్లాకేంద్రంలోని ఎన్టీఆర్‌ మహిళా డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టులను భర్తీ చేసేందుకు అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ రాజేంద్రప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు 3, హిందీ 1, ఉర్దూ 1, కామర్స్‌ 1, ఫిజిక్స్‌1 అప్‌లైడ్‌ న్యూట్రీషన్‌ 1, హిస్టరీ 3, పొలిటికల్‌ సైన్స్‌ 1 , జువాలజీ 2, కంప్యూటర్‌ అప్లికేషన్‌ 1, బోటనీ 1, గణితం 1 సబ్జెక్టులలో ఖాళీలు ఉన్నాయని, అభ్యర్థులు ఈనెల 11వ తేదీ లోగా కళాశాలలో ధరఖాస్తు లు చేసుకోవాలని, అనంతరం ఇంటర్వ్యూల ఆధారం నిర్వహిస్తామని పేర్కొన్నారు.

మిలాద్‌ ఉన్‌ నబీ వేడుకలు ఒక రోజు వాయిదా

జడ్చర్ల: ఈనెల 16న జరగాల్సిన మిలాద్‌ ఉన్‌ నబీ వేడుకలను ఒక రోజు ఆలస్యంగా ఈనెల 17న నిర్వహించే విధంగా చర్యలు చేపట్టినట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో జడ్చర్లకు చెందిన పలువురు ముస్లిం మత పెద్దలతో ఆయన సమావేశమయ్యారు. ఈనెల 16న జడ్చర్లలో గణేశ్‌ నిమజ్జనోత్సం ఉండడంతో అదే రోజు మిలాద్‌ ఉన్‌ నబీ రావడంతో శాంతి భద్రతల సమస్యలు తలెత్తే పరిస్థితి ఉంటుందని డీఎస్పీ వారికి వివరించారు. దీంతో ఒక రోజు వాయిదా వేసుకొని ఈ నెల 17న మిలాద్‌ వేడులకు నిర్వహించేందుకు ముస్లింలు నిర్ణయం తీసుకున్నారు. దీంతో డీఎస్పీ వారిని అభినందించారు.

ఎన్‌ఎంఎంఎస్‌లో పేరు నమోదుకు అవకాశం

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: నేషనల్‌ మెరిట్‌ మీన్స్‌ స్కాలర్‌షిప్‌ 2024–25 విద్యాసంవత్సరం ఎంపికై న వారు తమ పేరును నేషనల్‌ స్కాలర్‌షిప్‌ పోర్టల్‌ నమోదు చేసుకునేందుకు ఈనెల 30వ తేదీ వరకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని డీఈఓ రవీందర్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

కోయిల్‌సాగర్‌కుపెరిగిన వరద

5 గేట్ల ద్వారా నీటి విడుదల

దేవరకద్ర: కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టుకు మళ్లీ వరద పెరగడంతో 5 గేట్లను తెరిచి నీటి విడుదల చేస్తున్నారు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు మండలంలో 4.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గురువారం ఒక గేటు తెరిచి నీటిని వదలగా శుక్రవారం ఉదయం ప్రాజెక్టు ఎగువ ప్రాంతం నుంచి వచ్చే పెద్దవాగు ప్రవాహం పెరగడంతో 5 గేట్లను ఒక అడుగు మేర తెరిచి 3,500 క్యూసెక్కుల నీటిని వాగులోకి వదిలారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 32.6 అడుగులు కాగా ప్రస్తుతం 32 అడుగుల మేర నీటి మట్టం ఉంది. నీటి నిల్వను కొనసాగిస్తూ.. పైనుంచి వచ్చిన వరద నీటిని వాగులోకి వదులుతున్నారు.

డెమో ఇంటర్వ్యూలు

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: జిల్లాలోని మైనార్టీ గురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న నాలుగు ఉపాధ్యాయ పోస్టులకు శుక్రవారం జిల్లాకేంద్రంలోని బాలుర–1 , 2 గురుకులాల్లో డెమో ఇంటర్వ్యూలు నిర్వహించారు. జడ్చర్ల బాలికల–1లో పీజీటీ మ్యాథ్స్‌, మహబూబ్‌నగర్‌లోని బాలికల–2లో పీజీటీ బయోసైన్స్‌, బాలికల–3లో పీజీటీ బయోసైన్స్‌, బాలుర–1లో టీజీటీ ఉర్ధూ ఔట్‌ సోర్సింగ్‌ పోస్టులకు డెమో ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు ఆర్‌ఎల్‌సీ ఖాజా బావుద్దీన్‌ తెలిపారు. సీనియారిటీ, మెరిట్‌, ప్రతిభ ఆధారంగా ఎంపిక ఉంటుందని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
డీసీసీబీ సీఈఓగాపురుషోత్తంరావు 
1
1/1

డీసీసీబీ సీఈఓగాపురుషోత్తంరావు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement