బీఆర్‌ఆర్‌ కళాశాలకు స్వయం ప్రతిపత్తి | - | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఆర్‌ కళాశాలకు స్వయం ప్రతిపత్తి

Published Sat, Sep 7 2024 1:32 AM | Last Updated on Sat, Sep 7 2024 1:32 AM

బీఆర్‌ఆర్‌ కళాశాలకు స్వయం ప్రతిపత్తి

జడ్చర్ల టౌన్‌: జడ్చర్ల డా.బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ, పీజి కళాశాలకు యూజీసీ స్వయం ప్రతిపత్తి హోదా ఇచ్చిందని శుక్రవారం కళాశాల ప్రిన్సిపాల్‌ డా.సుకన్య వెల్లడించారు. ఫిబ్రవరిలో న్యాక్‌ బృందం కళాశాలను పరిశీలించి మార్చినెలలో ఏ–గ్రేడ్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఏ–గ్రేడ్‌ దక్కడంతో ఢిల్లీ యూనివర్సిటీ గ్రాంట్‌ కమిషన్‌ పదేళ్ల పాటు స్వయంప్రతిపత్తి హోదా (అటానమస్‌) కల్పించింది. గత నెల 27న ఢిల్లీలో యూజీసీ నిర్వహించిన స్టాండింగ్‌ కమిటీ పరిశీలన చేసి అటానమస్‌ స్టేటస్‌ ఇస్తూ శుక్రవారం కళాశాలకు లేఖను పంపించారు. ఈ విద్యా ఏడాది 2024–25 నుంచే అమలులోకి వస్తుందని ప్రిన్సిపాల్‌ తెలిపారు. స్వయంప్రతిపత్తి హోదా రావడంపై ప్రిన్సిపాల్‌, అధ్యాపక బృందం సంతోషం వ్యక్తం చేశారు. విద్యాప్రమాణాలు, కళాశాల అభివృద్ధి గణనీయంగా పెరిగేందుకు అటానమస్‌ హోదా ఉపయోగపడుతుందని వారు అభిప్రాయపడ్డారు.

మినీ యూనివర్సిటీగా...

అటానమస్‌ దక్కడంతో డిగ్రీ, పీజి కళాశాల ఇకపై మినీ యూనివర్సిటీ కానుంది. పాఠ్యాంశాల తయారీలో మార్పులు చేర్పులు పరీక్షల నిర్వహణ అంతా కళాశాలలోనే నిర్వహించనున్నారు. ఇప్పటి వరకు యూనివర్సిటీపై ఆధారపడి పరీక్షలు నిర్వహించాల్సి ఉండేది. ఇక కళాశాలలో కొత్త కోర్సుల ప్రారంభం, ఫీజుల నియంత్రణ వంటి నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు రానుంది. యూనివర్సిటీకి ప్రతి ఏటా చెల్లించే లక్షలాది రూపాయల ఫీజులు కళాశాలకే దక్కనుండడంతో మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది. కళాశాలకు స్వయంప్రతిపత్తి రావటం పట్ల పూర్వవిద్యార్థుల సంఘం కన్వీనర్‌ రాంమోహన్‌, కో కన్వీనర్‌ బి.రవిశంకర్‌లు అభినందనలు తెలిపారు. జిల్లాలో ఉన్న మూడు డిగ్రీ, పీజి కళాశాలలకు స్వయం ప్రతిపత్తి లభించినట్లయింది. ఎంవీఎస్‌ డిగ్రీ కళాశాలకు గతంలోనే స్వయం ప్రతిపత్తి ఉండగా.. 15 రోజుల క్రితం జిల్లాకేంద్రంలోని ఎన్టీఆర్‌ మహిళా డిగ్రీ కళాశాలకు స్వయం ప్రతిపత్తి దక్కింది.

యూజీసీ నుంచి

కళాశాలకు అందిన సమాచారం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement