పంట నష్టం.. 1736 ఎకరాలు | - | Sakshi
Sakshi News home page

పంట నష్టం.. 1736 ఎకరాలు

Published Sat, Sep 7 2024 1:32 AM | Last Updated on Sat, Sep 7 2024 1:32 AM

పంట నష్టం.. 1736 ఎకరాలు

మహబూబ్‌నగర్‌ (వ్యవసాయం): జిల్లాలో వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అనేక చోట్ల అపార నష్టం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో ఒకేరోజు 10 సెం.మీ. పైగా వర్షపాతం నమోదైంది. దీంతో అనేక చోట్ల వరదల వల్ల పలుపంటలకు భారీగా నష్టం వాటిల్లింది. అధికారులు ఆయా గ్రామాలలో తిరిగి పంట నష్టంపై ప్రాథమిక అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపారు. పత్తి, వరి, జొన్న, మొక్కజొన్నతో పాటు పలు పంటలకు నష్టం జరగగా.. కూరగాయ పంటలు కూడా భారీగా దెబ్బతిన్నాయి. జిల్లాలో అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం 1,736 ఎకరాల్లో పంట నష్టం జరగగా.. జిల్లావ్యాప్తంగా 852 మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. 950 ఎకరాల్లో వరి, 642 ఎకరాల్లో పత్తి, 44 ఎకరాల్లో మొక్కజొన్న, 75 ఎకరాల్లో జొన్నపంటలకు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. రెండు ఎకరాల్లోనే పూల తోటలకు నష్టం జరిగిందని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి వేణుగోపాల్‌ తెలిపారు. కానీ భారీ వర్షాలకు అనేక మండలాల్లో కూరగాయల తోటలు ఽపెద్దఎత్తున ధ్వంసమయ్యాయని రైతులు చెబుతుంటే అధికారులు మాత్రం కూరగాయల తోటలకు ఏమాత్రం నష్టం లేదని చెప్పడం గమనార్హం పంటలు నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం అందజేస్తామని ప్రకటించింది. ఈ మేరకు పంట నష్టం అంచనాలను తేల్చాలని అధికారులను ఆదేశించారు. దీంతో ప్రాథమిక పంట నష్టం అంచనాలను ప్రభుత్వానికి పంపారు. వీటి ఆధారంగా త్వరలో రైతులకు నష్టపరిహారం అందించనున్నారు.

6 రోజుల్లోనే నెల సగటుకు మించి

ఈ సీజన్‌లో అతి భారీ వర్షాలు పడటంతో జిల్లాలో సగటు కంటే అధిక వర్షపాతం నమోదైంది. జిల్లాలో ఇప్పటి వరకు 383.3 మి.మీ. వర్షపాతం కురవాల్సి ఉండగా అంతకుమించి 762.3 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఇది సగటు కంటే 379 మి.మీ అధిక కావడం గమనార్హం.

ప్రాథమికంగా అంచనా వేసిన అధికారులు

భారీగా దెబ్బతిన్న వరి, పత్తి పంటలు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement