వైద్యసిబ్బంది సమయపాలన పాటించాలి | - | Sakshi
Sakshi News home page

వైద్యసిబ్బంది సమయపాలన పాటించాలి

Published Sat, Sep 21 2024 1:36 AM | Last Updated on Sat, Sep 21 2024 1:36 AM

వైద్యసిబ్బంది సమయపాలన పాటించాలి

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): ప్రాథమిక వైద్య ఆరోగ్యకేంద్రాలు, ఉపకేంద్రాల డాక్టర్లు, సిబ్బంది సమయపాలన పాటించాలని కలెక్టర్‌ విజయేందిర ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోనీ వీసీ హాల్‌ నుంచి వైద్య, ఆరోగ్యశాఖ కార్యక్రమాలపై ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల మెడికల్‌ ఆఫీసర్లు, సబ్‌ సెంటర్ల మెడికల్‌ ఆఫీసర్లతో వెబ్‌ఎక్స్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పీహెచ్‌సీలు, సబ్‌ సెంటర్లలో అన్ని రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. అన్ని ప్రభుత్వ వైద్యశాలలు, వాటి ఆవరణలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి శుక్రవారం డ్రై డే కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ఫీవర్‌ సర్వేను పర్యవేక్షణ చేయాలన్నారు. ప్రతి నెల 1వ తేదీన గ్రామహెల్త్‌, శానిటేషన్‌, న్యూట్రిషన్‌ దినోత్సవం తప్పకుండా నిర్వహించాలని సూచించారు. పీహెచ్‌సీలు, సబ్‌సెంటర్లలో సిబ్బంది, మెడికల్‌ సామగ్రి కొరత ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. అదనపు కలెక్టర్‌ శివేంద్రప్రతాప్‌, డీఎంహెచ్‌ఓ పద్మ తదితరులు పాల్గొన్నారు.

ఆయిల్‌పాం లక్ష్యాన్ని పూర్తి చేయాలి

ఈ ఏడాది జిల్లాలో నిర్దేశించిన 2,500 ఎకరాల ఆయిల్‌పాం తోటలపెంపకం లక్ష్యాన్ని పూర్తి చేయా లని కలెక్టర్‌ విజయేందిర ఆదేశించారు. జిల్లాస్థాయి ఆయిల్‌పాం కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడు తూ జిల్లాలో ఆయిల్‌ తోటల విస్తరణతో పాటు, మొక్కలను నాటడం త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆయిల్‌పాం తోటల ఏరియా పెంచేందుకు రైతులను గుర్తించాలని, అలాగే ప్లాంటేషన్‌ వేగంగా చేయించాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో ప్రస్తుతం పనిచేస్తున్న క్లస్టర్‌ అధికారుల సంఖ్యను పెంచాలని సూచించారు. ఉద్యాన, వ్యవసాయ శాఖలు సమన్వయంతో పనిచేసి ఈ ఏడాది ఇచ్చిన 2,500 ఎకరాల లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లా ఉద్యానశాఖ అధికారి వేణుగోపాల్‌, తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement