మహిళా సాధికారతే ప్రధానం | - | Sakshi
Sakshi News home page

మహిళా సాధికారతే ప్రధానం

Published Sat, Sep 21 2024 1:36 AM | Last Updated on Sat, Sep 21 2024 1:36 AM

మహిళా సాధికారతే ప్రధానం

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: మహిళా సంఘాల్లో ఆర్థిక అసమానతలను తొలగించి సాధికారత సాధించడమే తమ ధ్యేయమని మున్సిపల్‌ చైర్మన్‌ ఎ.ఆనంద్‌కుమార్‌గౌడ్‌ అన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్‌ మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశ మందిరంలో స్మాల్‌ ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐడీబీఐ) ఆధ్వర్యంలో మెప్మా సీఆర్‌పీలకు ఒకరోజు శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెప్మా ద్వారా మహిళలకు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఇందిరా మహిళాశక్తి పథకం కింద బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకుని వివిధ యూనిట్లు ఏర్పాట్లు చేసుకొని ఉపాధి పొందాలన్నారు. ముఖ్యంగా మహిళలను బిజినెస్‌ ఇంటర్‌ప్రీనర్‌గా తయారు చేయాలన్నారు. అనంతరం మెప్మా రాష్ట్ర మిషన్‌ కో–ఆర్డినేటర్‌ పద్మ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని మహిళా సంఘాల పనితీరుపై సర్వే చేయాలన్నారు. ఎవరు ఏ యూనిట్‌ ఏర్పాటు చేసుకుంటారో పూర్తి వివరాలు సేకరించాలన్నారు. ఉపాధి అవకాశాలు కల్పించే వ్యాపారాలు నిర్వహిస్తే బాగుంటుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ డి.మహేశ్వర్‌రెడ్డి, లక్ష్మీగణపతి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఇంటర్‌ప్రీనర్‌షిప్‌ ప్రతినిధి గోపీనాథ్‌రెడ్డి, మెప్మా డీఎంసీ శివకుమార్‌గౌడ్‌, సీఓలు యాదయ్య, ఆంజనేయులు, వరలక్ష్మి, నిర్మల, దేవమ్మ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement