బాధను మరిపించిన పండుగ
నవాబుపేట: శామగడ్డతండా ఉదండాపూర్ రిజర్వాయర్‌లో ముంపునకు గురవుతోంది. దీంతో తండావాసులు ఇళ్లు, భూములు కోల్పోతామన్న బాధ తోనే కొన్నేళ్లుగా కాలం గడుపుతూ వచ్చారు. ప్రాజె క్టు పూర్తి కావస్తుందని.. ఇక ఇళ్లు వదిలి పోవాల్సి వస్తుందనే భయంతో ఇంతకాలం పండుగలకు దూ రంగా ఉన్నారు. తాజాగా ప్రాజెక్టు పనులు నిలిచి పోవడం.. పైగా ముంపునకు గురైతే వచ్చే పరిహా రం సైతం ఇటీవల అందడంతో రెండేళ్లకోసారి జరు పుకొనే తుల్జాభవాని పండుగను బుధవారం ఘనంగా జరుపుకొన్నారు. తండాలో ఏ ఇంట చూసినా పండుగ వాతావరణం కనిపించటం విశేషం.
● ప్రతి కుటుంబానికి రూ.16 లక్షలు.. ఆ ఇంట్లో పెళ్లయిన కుమారులు ఉంటే వారికి కూడా రూ.16 లక్షలు, పెళ్లిడుకు వచ్చిన ఆడపిల్ల ఉండే రూ.8 లక్షల చొప్పున పరిహారం చెల్లించారు. ఈ లెక్కన ప్రతి ఇంటికి సుమారుగా రూ.32 లక్షలకు తగ్గకుండా పరిహారం అందింది.
మా కుటుంబానికి రూ.16 లక్షలు..
తండాలో చాలామందిమి హైదరాబాద్‌లోనే ఉంటు న్నాం. తండా ప్రాజెక్టులో ముంపునకు గురవుతుంద న్న విషయం తెలియడంతో తండాను వదిలిపోవాలని నిర్ణయించుకొని పనులు చేసుకుంటున్నాం. తాజాగా వచ్చిన పరిహారంతో ఎక్కడైనా నివా సం ఏర్పాటు చేసుకోవాలని ఆలోచిస్తున్నారు.
– దశరత్‌నాయక్, శామగడ్డతండా
పండుగ జరుపుకోక ఏళ్లయింది..
పండుగ జరుపుకోక ఏళ్లవుతోంది. గతంలో ఓసారి కరోనా.. మరోసారి ఊరు పోతుందన్న భయంతో పండగకు దూరమయ్యాం. తాజాగా పరిహారం అందడం.. పైగా ప్రాజెక్టు పనులు నిలిచిపోవడంతో కాస్త ఉపశమనం కలిగి బాధలను దిగమింగుకొని పండుగ జరుపుకొంటున్నాం. పూర్తిస్థాయిలో ఒక్కసారి పరిహారం అందిస్తే ఏదైన ఉపాధి మార్గం చూసుకుంటాం. – నరేందర్, శామగడ్డతండా
Comments
Please login to add a commentAdd a comment