రైతులతో హరీశ్‌రావు మాటామంతి
మదనాపురం: పాలమూరు మట్టిబిడ్డల ఇంటి ఇలవేల్పు శ్రీకురుమూర్తిస్వామి దర్శనానికి బుధవారం వచ్చిన రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు మండలంలోని లక్ష్మీపురం వద్ద వరి ధాన్యం ఆరబోసుకున్న పలువురు రైతులతో మాట్లాడారు. వారి మాట ముచ్చెట ఇలా..
హరీశ్‌రావు: బాగున్నారా.. ఎన్ని ఎకరాల్లో సాగు చేశావ్ అంటూ మహిళా రైతు వాకిటి సత్యమ్మను పలకరించారు.
రైతు వాకిటి సత్యమ్మ: ఏం బాగున్నాం సార్.. మా ఒడ్లు కొంటలేరు.. తేమ వస్తలేదంటూ చెబుతున్నారు. చేసేది ఏమీ లేక ప్రయివేటు వ్యాపారులకు అమ్ముకుంటున్నం. రేవంత్‌రెడ్డి సార్‌కు ఓటేసి మోసపోయాం.
హరీశ్‌రావు: అవునా..
మరో మహిళా రైతు రాధమ్మ: సార్.. 2,500 రూపాయలు ఇస్తలేరు.
హరీశ్‌రావు: ఇస్తానని మొన్న కురుమూర్తిస్వామి దగ్గర ముఖ్యమంత్రి ఓట్టేసి పోయారు కదా ఇవ్వడం లేదా..
లంబాడీ శాంతమ్మ: సార్.. బస్సులు మా ఊరులో ఆపడం లేదు. ఫ్రీ బస్సు పెట్టిండ్రు ఫుల్లుగా జనం ఎక్కుతున్నారు. నా ఒడ్లు కొనకుంటే రెండు రోజుల క్రితం వ్యాపారులకు అమ్ముకున్న.
హరీశ్‌రావు: మా ప్రభుత్వంలో ఎప్పుడైన ఇలా జరిగిందా.. ఇబ్బంది పడ్డారా.. కాంగ్రెస్ పాలన ఇలా ఉంది చూడండి.
దామోదర్‌రెడ్డి: రైతుబంధు ఇస్తలేరు సార్.. ఒడ్లకు బోనస్ లేదు. మాయమాటలు నమ్మి మోసపోయినం.
హరీశ్‌రావు: రైతుబంధు కోసం మన పార్టీ పోరాటం చేస్తుంది. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం. ఆయన వెంట మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, గువ్వల బాలరాజు తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment