రేపు పాలమూరుకుబీసీ కమిషన్‌ రాక | - | Sakshi
Sakshi News home page

రేపు పాలమూరుకుబీసీ కమిషన్‌ రాక

Published Thu, Nov 21 2024 1:28 AM | Last Updated on Thu, Nov 21 2024 1:28 AM

రేపు

రేపు పాలమూరుకుబీసీ కమిషన్‌ రాక

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): బీసీ కమిషన్‌ ప్రతినిధి బృందం ఈనెల 22వ తేదీన జిల్లాలో పర్యటించనుంది. జిల్లా కలెక్టరేట్‌లోని మీటింగ్‌హాల్‌లో బహిరంగవిచారణ చేపట్టనున్నట్లు కలెక్టర్‌ విజయేందిర బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. సామాజిక, విద్య, వెనుకబడిన తరగతుల పరిస్థితులను తెలసుకుకోవడానికి జిల్లాకు రానున్నట్లు పేర్కొన్నారు. బీసీ కమిషన్‌ చైర్మన్‌ నిరంజన్‌ నేతృత్వంలో సభ్యులు జయప్రకాష్‌, సురేందర్‌, బాలలక్ష్మి రానున్నట్లు తెలిపారు. మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, గద్వాల, వనపర్తి, నారాయణపేట జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు బీసీ సంఘాలు, సంచార జాతులు, ప్రజలు, బీసీ వర్గాలు విద్య, ఉద్యోగాలు, రాజకీయల్లో అవసరమైన రిజర్వేషన్లు, దామాషాపై అభిప్రాయాలు తెలియజేయవచ్చని సూచించారు. ఉదయం 10 గంటలకు మహబూబ్‌నగర్‌, 11 గంటలకు నాగర్‌కర్నూల్‌ జిల్లా, మధ్యాహ్నం 12 గంటలకు వనపర్తి జిల్లా, 2 గంటలకు జోగుళాంబ గద్వాల జిల్లా, 3 గంటలకు నారాయణపేట జిల్లాకు చెందిన వారు అభిప్రాయాలు తెలపవచ్చని పేర్కొన్నారు.

సరిఫికెట్ల పరిశీలన

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌–4 పరీక్షలో ఎంపికై న రెవెన్యూ శాఖకు కేటాయించిన అభ్యర్థుల సర్టిఫికెట్లను జాగ్రత్తగా పరిశీలించాలని డీఆర్‌ఓ రవి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో సర్టిఫికెట్ల పరిశీలనను ఆయన తనిఖీ చేశారు. ఎంపికై న 38 మందికి సమాచారం ఇచ్చామని, సర్టిఫికెట్ల పరిశీలన గురువారం కూడా కొనసాగనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టరేట్‌ ఏఓ శంకర్‌, తదితరులు పాల్గొన్నారు.

24న జిల్లా మహిళా కబడ్డీ జట్టు ఎంపిక

మహబూబ్‌నగర్‌ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మెయిన్‌ స్టేడియంలో ఈనెల 24వ తేదీన ఉదయం 9 గంటలకు జిల్లా మహిళా కబడ్డీ జట్టు ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు బి.శాంతికుమార్‌, కురుమూర్తిగౌడ్‌ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికయ్యే జిల్లా జట్టు వచ్చే నెల 7 నుంచి 10 వరకు లాల్‌బహదూర్‌ స్టేడి యంలో జరిగే రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నీలో పాల్గొనాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఎంపికలకు హాజరయ్యే మహిళలు జిల్లావాసులై ఉండాలని, మిగతా వివరాల కోసం 94914 89852 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

ఆర్‌ఎన్‌ఆర్‌ క్వింటాల్‌ రూ.2,919

జడ్చర్ల: బాదేపల్లి మార్కెట్‌లో ఆర్‌ఎన్‌ఆర్‌ క్వింటాల్‌ గరిష్టంగా రూ.2,919, కనిష్టంగా రూ.1,506 ధరలు దక్కాయి. ఈ ఏడాది గరిష్టంగా ఇంత ధర రావడం ఇదే మొదటిసారి. అదేవిధంగా మొక్కజొన్న క్వింటాల్‌ గరిష్టంగా రూ.2,413, కనిష్టంగా రూ.1,831, హంస రకం గరిష్టంగా రూ.2,116, కనిష్టంగా రూ.1,837, పత్తి గరిష్టంగా రూ.6,689, కనిష్టంగా రూ.6,289, వేరుశనగ గరిష్టంగా రూ.6,530, కనిష్టంగా రూ.5,661, రాగులు రూ.2,229, జొన్నలు రూ.5,172 ధరలు లభించాయి.

బాధ్యతలు స్వీకరించిన డీఈఓ

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: నూతన జిల్లా విద్యాశాఖ అధికారిగా ప్రవీణ్‌కుమార్‌ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో డీఈఓగా ఉన్న రవీందర్‌ లంచం తీసుకుంటూ ఇటీవల ఏసీబీ అధికారులు చిక్కారు. దీంతో ఆయన స్థానంలో వికారాబాద్‌ జిల్లా విద్యాశాఖలో అడిషనల్‌ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రవీణ్‌కుమార్‌ను జోగుళాంబ గద్వాల, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు ఇన్‌చార్జి డీఈఓగా నియమించారు.ఈ సందర్భంగా ఆయనకు బీసీటీఏ, టీపీఆర్టీయూ, ప్రైవేటు స్కూల్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శుభాకాంక్షలు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
రేపు పాలమూరుకుబీసీ కమిషన్‌ రాక  
1
1/1

రేపు పాలమూరుకుబీసీ కమిషన్‌ రాక

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement