గడువులోగా అనుమతులు మంజూరు చేయాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ టీిజీ ఐపాస్ ద్వారా పరిశ్రమల స్థాపనకు వివిధ శాఖల నుంచి మంజూరు చేయాల్సిన అనుమతులను నిర్దేశిత గడువులోగా మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశానికి హాజరై ఆమె మాట్లాడారు. టీఫ్రైడ్ ద్వారా షెడ్యూల్డ్ కులాల వారికి ట్రాక్టర్ అండ్ ట్రైలర్ వాహనాలు 9 మందికి, షెడ్యూల్డ్ తెగల వారికి 8 మందికి ట్రాక్టర్ అండ్ ట్రైలర్స్‌కు, టాటా ఏస్, మారుతి డిజైర్ వాహనాలకు, పెట్టుబడి సబ్సిడీ, సర్వీస్ సెక్టార్ ఒకరికి పావలా వడ్డీ మంజూరుకు కమిటీలో ఆమోదం తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల జనరల్ మేనేజర్ ప్రతాప్, ఎల్‌డీఎం భాస్కర్, భూగర్భజల వనరుల శాఖ డీడీ రమాదేవి, కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజనీర్ సురేష్, మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ రఘు పాల్గొన్నారు.
మాతృ మరణాలను తగ్గించాలి
జిల్లాలో మాతృ మరణాలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయేందిర ఆదేశించారు. మాతృమరణాలపై వైద్యాధికారులతో జరిగిన సమీక్షలో ఆమె మాట్లాడారు. ఆశ కార్యకర్తల నుంచి జిల్లా వైద్యాధికారుల వరకు అందరు అప్రమత్తంగా ఉండాలన్నారు.డీఎంహెచ్‌ఓ కృష్ణ, సంక్షేమాధికారి జరీనాబేగం, పీఓఎంహెచ్‌ఎన భాస్కర్‌నాయక్ పాల్గొన్నారు.
సర్వే వివరాలు జాగ్రత్తగా
నమోదు చేయాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే వివరాలను డేటా ఎంట్రీ జాగ్రత్తగా నిర్వహించాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోనీ మీటింగ్ హాల్‌లో డేటా ఎంట్రీ ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చారు. బుధవారం సాయంత్రం మండల లాగిన్‌లకు యాజర్ ఐడీ పాస్‌వర్డ్‌లను ఈడీఎం ఇవ్వనున్నట్లు చెప్పారు. సాయంత్రం డేటా ఎంట్రీ డెమో నిర్వహించి వివరాలు నమోదు చేయాలన్నారు. గ్రామాల్లో నిర్వహించిన సర్వే వివరాలను ఎన్యుమరేటర్‌లు డేటా ఎంట్రీ చేయాలన్నారు. ఆ వివరాలను గొప్యతగా ఉంచాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment