ఉదండాపూర్‌నిర్వాసితులకున్యాయం చేయాలి
జడ్చర్ల: ఉదండాపూర్ నిర్వాసితులకు న్యాయం చేయాలని ఎంపీ డీకే అరుణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఆమె ఉదండాపూర్‌లో జరిగిన కార్యక్రమంలో నిర్వాసితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి హామీ ఇచ్చిన విధంగా ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కుటుంబంలో మేజర్‌లకు కూడా ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ వర్తించేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. భూపరిహారం పెంచి రైతులకు న్యాయం చేయాలని, గతంలో ప్రకటించిన ధరలకు ప్రస్తుత భూముల ధరలకు భారీ వ్యత్యాసం ఉందన్నారు. ప్రస్తుత భూముల ధరలకు అనుగుణంగా పరిహారం పెంచి ఇవ్వాలన్నారు. నిర్వాసితులు ఐకమత్యంగా ఉండి తమ డిమాండ్లను నెరవేర్చుకోవాలని కోరారు. నిర్వాసితుల తరుఫున తాము పోరాడుతామని పేర్కొన్నారు. తాను మంత్రిగా ఉన్న సమయంలోనే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ సర్వేకు నిధులు మంజూరు చేశామని గుర్తు చేశారు. జూరాల నుంచి ప్రాజెక్ట్‌ను మొదలు పడితేనే మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలో ప్రతి ఎకరాకు సాగునీరు అందే అవకాశం ఉందన్నారు. కానీ బీఆర్‌ఎస్ ప్రభుత్వం డీపీఆర్ మార్చిందన్నారు. నిర్వాసితుల సమస్యలను సంబంధిత మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. రైతులకు పూర్తిస్థాయిలో న్యాయం చేసిన తర్వాతే ప్రాజెక్ట్ పనులు మొదలు పెట్టాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చ అధ్యక్షురాలు సాహితీ, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment