ఫుడ్ పాయిజన్‌కు గురైన విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు దారుణంగా ప్రవర్తించినట్లు తెలిసింది. కడుపు నొప్పి మొదలైన వెంటనే విద్యార్థులు విషయాన్ని ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లగా.. తరగతి గదిలో ఉంచి ప్లాస్టిక్ పైపుతో కొట్టి బెదిరించినట్లు కొందరు విద్యార్థులు పేర్కొన్నారు. అయితే 3 గంటల తర్వాత విద్యార్థులు వాంతులు, విరేచనాలు చేసుకోవడంతో అప్పుడు వైద్యసిబ్బందికి సమాచారం చేరవేశారని ఆరోపించారు. అయితే పాఠశాలలో మొత్తం 598 మంది విద్యార్థులు ఉండగా.. బుధవారం 426 మంది హాజరయ్యారని హెచ్‌ఎం మురళీధర్‌రెడ్డి తెలిపారు. సాయంత్రం ఫుడ్ ఇన్‌ఫెక్షన్ అధికారులు నీలమ్మ, శ్రీనివాసులు పాఠశాలను సందర్శించి.. నమూనాలు సేకరించారు.
Comments
Please login to add a commentAdd a comment