అక్రమ కేసులతో బీఆర్‌ఎస్‌పై వేధింపులు
జెడ్పీసెంటర్(మహబూబ్ నగర్): ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిస్తున్న బీఆర్‌ఎస్ నాయకులపై ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధిస్తుందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. జైలు నుంచి విడుదల ఆయిన మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తమ్ముడు శ్రీకాంత్‌గౌడ్‌ను బుధవారం శ్రీనివాస్‌గౌడ్ ఇంట్లో హరీశ్‌రావు పరామర్శించారు. కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కూలగొట్టిన అంధుల ఇళ్లను కట్టించు ఇవ్వాలని డిమాండ్ చేసినందుకు శ్రీకాంత్‌గౌడ్‌పై తప్పుడు కేసు నమోదుచేసి జైలుకు పంపించారని అన్నారు. శ్రీనివాస్‌గౌడ్ మహబూబ్‌నగర్ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారన్నారు. రాజకీయంగా ఎదుర్కొలేకనే తప్పుడు కేసులు బీఆర్‌ఎస్ నాయకులపై నమోదు చేస్తున్నారని అన్నారు. నాయకులకు, కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి, మాజీ ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, గువ్వల బాలరాజు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రొళ్ల శ్రీనివాస్ ఉన్నారు.
జైలు నుంచి విడుదల అయిన శ్రీకాంత్‌గౌడ్
పరామర్శించిన మాజీ మంత్రి హరీశ్‌రావు
Comments
Please login to add a commentAdd a comment