విద్యార్థినులను వేధించిన ఉపాధ్యాయుడు
అమ్రాబాద్: పదర మండలంలోని ఓ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తుండటంతో తల్లిదండ్రులకు తెలిపారు. శుక్రవారం తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి నిలదీయడంతో విషయం వెలుగు చూసింది. ఈ విషయంపై మండల విద్యాధికారి బుచ్చిబాబుని వివరణ కోరగా విద్యార్థినులు, ఉపాధ్యాయుడితో మాట్లాడి పూర్తి వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు తెలియజేస్తానని సమాధానమిచ్చారు. కాగా శుక్రవారం షీటీం హెడ్ కానిస్టేబుల్ పద్మ, కానిస్టేబుల్ వెంకటేశ్, చైల్డ్ వెల్ఫేర్ సభ్యురాలు ప్రమీల పాఠశాలకు వచ్చి వివరాలు సేకరించినట్లు తెలిసింది. అనంతరం విద్యార్థులకు బాలల హక్కులపై అవగాహన కల్పించారు. బాల్య వివాహాలను అరికట్టాలని, విద్యా ర్థినులపై వివక్ష చూపరాదని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment