కేఎల్‌ఐ కాల్వలో పడి వృద్ధుడు గల్లంతు
నాగర్‌కర్నూల్ క్రైం: కేఎల్‌ఐ కాల్వలో పడి వృద్ధుడు గల్లంతైన సంఘటన మండలంలోని గుడిపల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గుడిపల్లి గ్రామానికి చెందిన బంగారయ్య (65) పశువుల కాపరిగా పనిచేస్తున్నాడు. శుక్రవారం ఉదయం ఇంటికి పోయి గ్రామసమీపంలోని కేఎల్‌ఐ కాల్వలోకి దూకాడు. గ్రామస్తులు గమనించి పోలీస్‌లకు, ఫైర్ సిబ్బందికి సమాచారమిచ్చారు. అగ్నిమాపక శాఖాధికారులు కాల్వ వద్దకు చేరుకున్నారు. కాల్వకు పారే నీటిని నిలిపివేఇ బంగారయ్య మృతదేహం కోసం గాలించారు. సాయంత్రం వరకు దొరకకపోవడంతో గాలింపును ఆపేశారు. సంఘటనకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ గోవర్దన్ తెలిపారు.
మృతదేహం లభ్యం
గద్వాల క్రైం: మహిళ మృతదేహం లభ్యమైన ఘటన శుక్రవారం పట్టణంలోని జూరాల కుడికాలువలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. బీసీ కాలనీకి చెందిన రాములమ్మ(48) రెండు రోజుల క్రితం కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. భర్త గోకారి, కుటుంబ సభ్యులు బంధువుల వద్ద వాకబు చేశారు. ఫలితం లేకుండా పోయింది. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా శుక్రవారం మధ్యాహ్నం హమాలీకాలనీ సమీపంలో జూరాల కుడి కాలువలో మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రాములమ్మ మృతదేహంగా గుర్తించారు.
వేధింపుల కేసులో
మూడేళ్ల జైలు శిక్ష
అమరచింత: భార్యను శారీరకంగా, మానసికంగా వేధించిన కేసులో భర్తకు మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.2వేలు జరిమానా విధించినట్లు ఎస్‌ఐ సురేష్ తెలిపారు. అమరచింతకు చెందిన బోయ రాధమ్మ, కృష్ణమూర్తి దంపతులు. 2017సంవత్సరంలో రాధమ్మ తన భర్త వేధిస్తున్నాడని అప్పటి ఎస్సై సత్యనారాయణ రెడ్డికి ఫిర్యాదుచేసింది. హెడ్‌కానిస్టేబుల్ జమీరుద్దీన్ కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. కేసు పూర్వపరాలు పరిశీలించిన ఆత్మకూరు సివిల్ కోర్టు జడ్జి నిందితుడికి మూడేళ్ల జైలుశిక్షతో పాటు రూ.2వేలు జరిమానా విధించారన్నారు. బాధితుల తరపున కేసును వాదించిన ప్రభుత్వ న్యాయవాది అరుణోదయకుమార్, సీడీఓ బాలరాజును ఎస్పీ గిరిధర్‌రావు అభినందించారని ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment