వచ్చే బడ్జెట్‌లో క్రీడలకు నిధులు
జడ్చర్ల టౌన్: సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో పీఈటీలు, పీడీల సమస్యలు పరిష్కారమవుతాయని, వచ్చే రాష్ట్ర బడ్జెట్‌లో విద్యతో పాటు క్రీడలకు ప్రత్యేక నిధులు కేటాయించనున్నట్లు వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హర్షవర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు. జడ్చర్ల మినీస్టేడియంలో మూడురోజుల పాటు ఎస్‌జీఎఫ్ ఆధ్వర్యంలో మోయిన్ కార్యనిర్వహణలో జరిగిన అండర్ –19 ఫుట్‌బాల్ బాలబాలికల రాష్ట్ర టోర్నమెంట్ బుధవారం ముగిసింది. ముగింపులో భాగంగా విజేతలకు ఆయన బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల నిర్వహణకు పీఈటీలు, పీడీలు ఎంతో కృషి చేస్తున్నారని, చాలాచోట్ల సొంతంగా, దాతల సహాయంతో క్రీడలు నిర్వహిస్తున్నారన్నారు. ఇకపై ఇబ్బంది లేకుండా బడ్జెట్‌లో నిధులు కేటాయించబడ్తాయని, ఇందుకోసం సీఎంకు విన్నవించగా, సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. రాష్ట్రంలో పదోన్నతులకు నోచుకోకుండా ఉన్న 114మంది పీఈటీల కోరిక నెరవేరబోతుందని, వారిని పీడీలుగా చూడబోతున్నామన్నారు. ఫిజికల్ డైరెక్టర్లకు జూనియర్ లెక్చరర్లుగా అవకాశం కల్పించాలని పోరాడుతున్నామని, అందుకు అడ్డుగా ఉన్న జీఓనెం. 10ని రద్దు చేయించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. జీఓనెం.10 రద్దు అయితే జీఓ నెం.79 ద్వారా పీడీలు జూనియర్ లెక్చరర్లుగా కళాశాలల్లోకి అడుగుపెడ్తారన్నారు. సమావేశంలో పీడీ, పీఈటీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నిరంజన్, కళాశాల ఎస్‌జీఎఫ్ కార్యదర్శి పాపిరెడ్డి, ఫ్‌లైవాక్ అసోసియేషన్ అధ్యక్షుడు రాంరెడ్డి, వార్డుకౌన్సిలర్ సతీష్, పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు.
త్వరలోనే జీఓ నెం.10రద్దు
పీఈటీల సమస్యలు పరిష్కారం
వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హర్షవర్ధన్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment