ప్రతి కేసులో పారదర్శకంగా విచారణ చేపట్టాలి
మాట్లాడుతున్న ఎస్పీ డి.జానకి
మహబూబ్‌నగర్ క్రైం: ప్రతి కేసులో పారదర్శకంగా పకడ్బందీగా విచారణ చేపట్టాలని, కేసులలో నిందితులకు పడే శిక్ష శాతాన్ని పెంచాలని ఎస్పీ డి.జానకి అన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం నేర సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. స్టేషన్‌లో నమోదైన ప్రతి కేసులో లోతైన విచారణ చేయాలన్నారు. గ్రేవ్ కేసులలో ఇంకా విచారణలో ఉండడానికి కారణాలు పరిశీలిస్తూ కేసులను ఛేదించడంలో ఇంకా వేగం పెంచాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, పోక్సో కేసులలో శిక్ష శాతం పెంచడానికి సరైన ఆధారాలు సమర్పిస్తూ పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. కంటెస్టెడ్ కేసులు కోర్టు ట్రయల్స్ నడిచే సమయంలో సాక్షులను హాజరుపరుస్తూ, కేసుల విషయాలను బాధితులకు అప్డేట్ చేస్తూ నిందితులకు సరైన శిక్షలు పడే విధంగా చూడాలన్నారు. జిల్లాలో మహిళలకు వ్యతిరేకంగా జరిగే నేరాలలో నేరస్తులకు కఠిన శిక్ష పడే విధంగా చార్జీషీట్లు నమోదు చేయాలని, సరైన ఆధారాలు కోర్టులో హాజరుపరచాలన్నారు. దొంగతనాల కేసులను ఛేదించడంలో పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టాలని, అవసరమైన యాక్షన్‌ప్లాన్‌తో ముందుకెళ్లాలన్నారు. ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్ట్స్, అరెస్టులు పెండింగ్ లేకుండా చూసుకోవాలని, ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై వెంటనే స్పందించి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఏఎస్పీ రాములు, డీఎస్పీలు వెంకటేశ్వర్లు, రమణారెడ్డి, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment