చిక్కులు తొలగేనా..!
ఈ ఫొటోలోని రైతు పేరు కె.శివప్ప. హన్వాడ మండలం పెద్దదర్పల్లికి చెందిన ఇతను టంకర రెవెన్యూ గ్రామ శివారులో సర్వే నంబర్ 36లో అర ఎకరం భూమిని 14 ఏళ్ల క్రితం సాదా కాగితంపై కొనుగోలు చేశాడు. గత ప్రభుత్వం సాదాబైనామా కింద యాజమాన్య హక్కులు కల్పించేలా క్రమబద్ధీకరణకు అవకాశం ఇవ్వడంతో 2020 జూన్‌లో మీసేవ సెంటర్‌లో దరఖాస్తు చేసుకున్నాడు. పలు కారణాలతో సాదాబైనామాల క్రమబద్ధీకరణ ప్రక్రియ అమలుకు నోచుకోలేదు. ప్రస్తుతం నూతన ప్రభుత్వం ధరణి స్థానంలో నూతనంగా భూభారతి పోర్టల్‌ను, ఆర్వోఆర్–24 చట్టం తీసుకొచ్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఆర్వోఆర్ చట్టం ముసాయిదా బిల్లుకు అసెంబ్లీ ఆమోదం లభించిన నేపథ్యంలో తన సమస్య పరిష్కారమవుతుందని ఆ రైతు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.
..ఇలా ఇతనొక్కడే కాదు.. సాదాబైనామా కింద యాజమాన్య హక్కుల కోసం వేలాది మంది ఎదురుచూస్తున్నారు. అంతేకాదు.. ధరణి పోర్టల్‌లో లోపం, వివిధ కారణాలతో భూ యాజమాన్య హక్కులు పొందలేకపోయి..అధికారుల చుట్టూ ఏళ్ల తరబడి ప్రదక్షిణలు చేస్తున్న వారు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురానున్న భూభారతి పోర్టల్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment