కొల్లాపూర్‌లో అంతర్జాతీయ సదస్సు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: కొల్లాపూర్‌లోని ప్రభుత్వ పీజీ కళాశాలలో ఈ నెల 28, 29 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు పీయూ వైస్ చాన్స్‌లర్ జీఎస్ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు శనివారం సెమినార్‌కు సంబంధించిన బ్రోచర్‌ను వీసీ ఆవిష్కరించారు. పాలమూరు యూనివర్సిటీ ఆధ్వర్యంలో పర్యావరణం, సుస్థిర అభివృద్ధి అనే అంశాలపై నిర్వహించే సదస్సుకు దేశ, విదేశాలకు చెందిన ప్రొఫెసర్లు హాజరవుతారని వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మార్క్‌పోలోనీస్, అధ్యాపకులు దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే కొల్లాపూర్‌లోని పీజీ కళాశాలలో నిర్వహించే సదస్సుకు కన్వీనర్‌గా సోషల్‌వర్క్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ దేవరాజ్ వ్యవహరిస్తారని పీజీ కళాశాల ప్రిన్సిపల్ మార్క్ పోలోనియస్ వెల్లడించారు.
విజయోత్సవ సభ బ్రోచర్ ఆవిష్కరణ
పాలమూరు యూనివర్సిటీ పరిధిలో ఇంజినీరింగ్, లా కళాశాలలు ఏర్పాటు చేస్తున్న సందర్భంగా బుధవారం నిర్వహించే విజయోత్సవ సభకు సంబంధించిన బ్రోచర్‌ను వీసీ జీఎస్ శ్రీనివాస్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు రాము, కార్తిక్, పవన్‌కుమార్, వంశీకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment