న్యాయసేవలు అందించేందుకు కృషిచేయాలి
పాలమూరు: క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎదురైనా చిత్తశుద్ధితో న్యాయ సేవలు అందించేందుకు తమవంతుగా చైల్డ్ ఫ్రెండ్లీ కమిటీ సభ్యులు పనిచేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిర అన్నారు. జిల్లా కోర్టులో శనివారం బాలల హక్కులు, చట్టాల అమలు, రక్షణ, సంరక్షణ తదితర అంశాలపై చైల్డ్ ఫ్రెండ్లీ కమిటీ సభ్యులకు రెండోరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ బాల్యవివాహాల నివారణ, బాలల చట్టాలు తదితర అంశాలపై సూచనలు, సలహాలు అందించారు. బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో గాలి పటాలను ఎగిరించే మాంజాల వల్ల జరిగే అనర్థాలపై అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం జిల్లాకేంద్రంలోని బాల సదన్, శిశుగృహ, స్టేట్ హోంలను న్యాయమూర్తి డి.ఇందిరతోపాటు చైల్డ్ ఫ్రెండ్లీ కమిటీ సభ్యులు సందర్శించారు. స్థానికంగా ఉన్న వసతులపై న్యాయమూర్తి ఆరాతీశారు.
Comments
Please login to add a commentAdd a comment