విద్యార్థి సంఘాల ఆందోళన
బాత్‌రూంలో సెల్‌ఫోన్ కలకలం విషయం బయటికి రాగానే పలువురు విద్యార్థి సంఘాల నాయకులు పెద్దఎత్తున పాలిటెక్నిక్ కళాశాల వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, సెల్‌ఫోన్ కెమెరాలు పెడుతుంటే నిర్లక్ష్యం వహించిన ప్రిన్సిపాల్, సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేయాలని, ఈ ఘటనపై కలెక్టర్, ఎస్పీ వివరణ ఇవ్వాలని డిమాడ్ చేశారు. దీంతో డీఎస్సీ వెంకటేశ్వర్లు, సీఐ అప్పయ్య, ఎస్‌ఐ శీనయ్య, సిబ్బంది అక్కడికి చేరుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పారు. కళాశాలలో సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతున్నాయని వారికి ఇబ్బంది కలిగించొద్దని కోరారు. విద్యార్థి సంఘాల నాయకులు ఎస్పీ కార్యాలయానికి వస్తే ఉన్నతాధికారులతో మాట్లాడి న్యాయం చేసేందుకు హామీ ఇస్తామని చెప్పడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.
పలు సెక్షన్ల కింద కేసులు నమోదు
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల బాలికల బాత్‌రూంలో మొబైల్‌తో వీడియో రికార్డు చేసిన సిద్ధార్థ్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు వన్‌టౌన్ ఎస్‌ఐ శీనయ్య తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి సదరు విద్యార్థిపై బీఎన్‌ఎస్ 77, 79 బీఎన్‌ఎస్, సెక్షన్ 66, సెక్షన్ 67, ఐపీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
● సాయంత్రం ఎస్పీ జానకి, అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్‌తో కలిసి కలెక్టర్ విజయేందిర కళాశాలను సందర్శించారు. ప్రిన్సిపాల్‌తో పాటు విద్యార్థినులతో మాట్లాడారు. విద్యార్థినుల భద్రతకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment