వైజ్ఞానిక ప్రదర్శనకు పకడ్బందీ ఏర్పాట్లు
జడ్చర్ల/ జడ్చర్ల టౌన్: మండలంలోని పోలేపల్లి శివారు ఎస్‌వీకేఎం పాఠశాలలో మంగళవారం నుంచి నిర్వహించనున్న రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాట్లు త్వరితగతిన పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్ అన్నారు. ఆదివారం రాత్రి ఆయన డీఈఓ ప్రవీణ్‌కుమార్తో కలిసి ఎస్‌వీకేంలో ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి విద్యార్థులు, ఉపాద్యాయులు కలిసి దాదాపు 2,500 మంది ప్రదర్శనకు హాజరయ్యే అవకాశం ఉందని, వారందరికి తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. అలాగే 861 ప్రయోగ ప్రదర్శనలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని, భోజనాలు, ఇతర సౌకర్యాలు సమకూర్చాలన్నారు. వాహనాల పార్కింగ్‌తోపాటు విడిది చేసే స్థలాల నుంచి ప్రదర్శన కేంద్రానికి వచ్చేందుకు బస్సు సౌకర్యం కల్పించాలన్నారు. సోమవారమే విద్యార్థులు, ఉపాధ్యాయులు కేంద్రానికి చేరుకుంటారని, వారికి అల్పాహారం, భోజనం ఏర్పాటు చేయాలన్నారు. అంతకు ముందు ఉదయం డీఈఓ ప్రవీణ్‌కుమార్ అన్నారు. ప్రదర్శన ఏర్పాట్లను పరిశీలించి.. వివిధ కమిటీల బాధ్యులతో సమీక్ష నిర్వహించారు. వైజ్ఞానిక ప్రదర్శనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో సైన్స్ ఆఫీసర్ శ్రీనివాసులు, ఎంపీడీఓ విజయ్‌కుమార్, నవాబ్‌పేట ఎంఈఓ జయరాం, శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్ ఎబినేజర్, ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు శ్రీనివాసులు, చంద్రకళ, యుగంధర్, వెంకట్రామరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment