5,35,058 మందికి వైద్య సేవలు
పాలమూరు: జిల్లా జనరల్ ఆస్పత్రిలో 2024 సంవత్సరంలో ఓపీ ద్వారా 5,35,058 మంది రోగులకు వైద్యసేవలు అందించామని, ఇక ఆస్పత్రిలో చేరి వైద్యం పొందిన వారు 45,674 మంది ఉన్నారని జిల్లా జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంపత్‌కుమార్ సింగ్ అన్నారు. ఆరోగ్య శ్రీ ద్వారా 4,258 మందికి వైద్య సేవలు అందించామని తెలిపారు. జనరల్ ఆస్పత్రికి సంబంధించి 2024లో వార్షిక నివేదికలో భాగంగా ఏడాది కాలంలో ఆస్పత్రిలో అందించిన వైద్యసేవల వివరాలను ఆయన వెల్లడించారు. గాంధీ, ఉస్మానియాలకు రెఫర్ కేసులు తగ్గించామని, ఆస్పత్రిని పూర్తిగా అప్‌గ్రేడ్ చేస్తున్నామని పరికరాలు పెంచడానికి ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. నర్సుల ప్రవర్తనలో మార్పు రావడానికి ప్రత్యేక కౌన్సెలింగ్, శిక్షణలు అందిస్తామని వెల్లడించారు. ఈ ఏడాది పేద రోగులకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి కృషి చేస్తామన్ని పేర్కొన్నారు.
● జనరల్ ఆస్పత్రిలో ఏడాదిలో 58,150 మంది గర్భిణులకు చికిత్స అందించగా.. ఇందులో 11,500 ఐపీ కేసులు ఉన్నాయన్నారు. 8,154 ప్రసవాలు జరిగితే.. ఇందులో ఆపరేషన్ ద్వారా 4,895, సాధారణ కాన్పులు 3,259 ఉన్నాయి. కాన్పు సమయంలో ఐదు మరణాలు ఉన్నాయన్నాయి. మేజర్ సర్జరీలు 7,387, మైనర్ సర్జరీలు 34,854 చేయడం జరిగిందని, ల్యాబ్‌లో 7,85,021 మందికి రక్త పరీక్షలు చేసినట్లు వివరించారు. ఎక్స్‌రే 91,556, యూఎస్‌జీ 37,825, సీటీ స్కాన్ 15,267, డయాలసిస్ 5,949 మందికి చేసినట్లు వెల్లడించారు. ఏడాది కాలంలో 1,898 మంది మరణించారని, 652 మృతదేహలకు పోస్టుమార్టం నిర్వహించామన్నారు. ఈసీజీ 32,359, హెచ్‌ఐవీ పరీక్షలు 18,460 మందికి చేస్తే ఇందులో 575 పాజిటివ్ వచ్చాయన్నారు. పాముకాటు 923, కుక్కకాటు 11,278, ఈఎన్‌టీ విభాగంలో 14,546 మందికి వైద్యసేవలు అందించారు. ఆర్థో విభాగంలో 32,166 ఓపీ కేసులు వస్తే, ఐపీ కేసులు 1,230 ఉన్నాయని, ఆర్థోలో మేజర్‌గా 819, మైనర్ సర్జరీలు 2,879 చేసినట్లు చెప్పారు. చిన్నపిల్లల విభాగంలో ఓపీ కేసులు 57,717, ఐపీ కేసులు 5,430 నమోదు కాగా పీఐసీ యూ ఐపీ 6,093, ఎస్‌ఎన్‌సీయూ ఓపీ 8,313, ఎస్‌ఎన్‌సీయూ ఐపీ 2,044 మంది చిన్నారులకు చికిత్స అందించారు. ఇక కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు 1,711, టీబీ పరీక్షలు 1,716 మందికి చేస్తే 102 మంది నిర్ధారణ అయినట్లు పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడి ఆస్పత్రికి వచ్చిన 12,003మందికి వైద్య చికిత్సలు అందించినట్లు వివరించారు.
గతేడాది జనరల్ ఆస్పత్రిలో
8154 ప్రసవాలు
7,387 మందికి మేజర్ ఆపరేషన్లు
సూపరింటెండెంట్ సంపత్‌కుమార్ సింగ్
Comments
Please login to add a commentAdd a comment