మొక్కజొన్న వ్యర్థాలు, పేడ నుంచి బయో ఆయిల్..
సంజీవని హెలీకాప్టర్..
హెలీకాప్టర్ ప్రమాదంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్, ఆయన సతీమణితో పాటు పలువురు మృత్యువాతపడిన దుర్ఘటనలను దృష్టిలో ఉంచుకుని సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల హైస్కూల్‌కు చెందిన విద్యార్థి ప్రణీత్ కుమార్ తన గైడ్ శోభారాణితో కలిసి ‘సంజీవని హెలీకాప్టర్’ ప్రయోగాన్ని ప్రదర్శించారు. హెలీకాప్టర్ ప్రమాదం జరిగినప్పుడు బుల్లెట్ ప్రూఫ్, ఫైర్‌ప్రూఫ్‌తో కూడిన బెలూన్ ఓపెన్ అయి సురక్షితంగా బయటపడేందుకు వీలుగా రూపొందించారు. ఎయిర్ బెలూన్‌లోనే ఆక్సిజన్ ఉండటం వల్ల అందులో ప్రయాణించే వారికి ఎలాంటి ప్రాణహాని ఉండదు. దీనికి జీపీఎస్ అనుసంధానం ఉండటం వల్ల హెలీకాప్టర్ క్రాషెస్‌ను గుర్తించేందుకు సులువవుతుంది.
మొక్కజొన్న వ్యర్థాలు, పేడ నుంచి బయో ఆయిల్ ఉత్పత్తి చేసే ఆవిష్కరణను నిజామాబాద్ విజయ హైస్కూల్ విద్యార్థులు విజిదేంద్రియ, శ్రీకర్‌లు తమ గైడ్ టీచర్ మధుతో కలసి ప్రదర్శించారు. మొక్కజొన్న వ్యర్థాలు పశువులు తినడం వల్ల అవి అనారోగ్యం బారిన పడతాయని.. వాటిని సక్రమంగా వినియోగిస్తే బయో ఆయిల్ తయారు చేయవచ్చని వీరి ఆవిష్కరణ నిరూపిస్తుంది. అలాగే పేడతో బయో గ్యాస్ తక్కువ వ్యయంతో చేసేలా ప్రదర్శన ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment