ఈసారైనా సాగేనా..?
పాలమూరు: గత రెండు నెలల కాలంలో నాలుగు సార్లు వాయిదా పడిన ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం ఈసారైనా సాగుతుందో.. లేక వాయిదా వేస్తారో అన్నది వేచి చూడాలి. నవంబర్ నుంచి డిసెంబర్ వరకు నాలుగుసార్లు సమావేశం ఏర్పాటుచేయాలని నిర్ణయించినా పలుమార్లు వాయిదాలు పడుతూ వస్తోంది. జిల్లా జనరల్ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నేడు(బుధవారం) ఉదయం 9.30 గంటలకు నిర్వహించనున్నారు. జిల్లా జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంపత్‌కుమార్‌సింగ్ అధ్యక్షతన సమావేశం కొనసాగనుంది. ఈ సమావేశానికి మహబూబ్‌నగర్, జడ్చర్ల, దేవరకద్ర ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి, జి.మధుసూదన్‌రెడ్డితో పాటు కలెక్టర్ విజయేందిర బోయి హాజరుకానున్నారు. సమావేశంలో ప్రధానంగా ఆస్పత్రిలో కావాల్సిన పరికరాలు, నిరుపయోగంగా ఉన్న 16పెయింగ్ గదుల మరమ్మతులపై, డ్రైనేజీ విధానం, ఎలక్ట్రికల్, వాటర్ ట్యాంక్ అంశాలపై చర్చ కొనసాగనుంది. ఈ కమిటీ సమావేశం ద్వారా అయిన ఆస్పత్రిలో పనిచేసే వైద్యుల సమయపాలన, రెఫర్ కేసుల తరలింపు, నర్సుల నిర్లక్ష్యమైన పనితీరు, గ్రూప్ రాజకీయాలపై చర్చ చేస్తారా? లేక సాదా సీదాగా సమావేశం ముగిస్తారా వేచి చూడాలి. జిల్లా జనరల్ ఆస్పత్రిలోని ఎంసీహెచ్ భవనంలో గైనిక్ విభాగంకోసం నూతనంగా ఏర్పాటుచేసిన ఆరు పడకల ఐసీయూ కేంద్రాన్ని, 8 పెయింగ్ గదులను ప్రారంభం చేయనున్నారు. దీంతో పాటు ఈఎన్‌టీ విభాగం, జనరల్ మెడిసిన్ విభాగంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఫార్మాసీ, ల్యాబ్ బ్లాక్‌లను ప్రారంభం చేయడానికి ఆస్పత్రి వైద్యాధికారులు ఏర్పాట్లుచేస్తున్నారు.
నేడు జనరల్ ఆస్పత్రి
అభివృద్ధి కమిటీ సమావేశం
హాజరుకానున్న
ఎమ్మెల్యేలు, కలెక్టర్
ఆరు పడకల ఐసీయూ
కేంద్రం ప్రారంభానికి సిద్ధం
Comments
Please login to add a commentAdd a comment