11న కురుమూర్తి క్షేత్రంలో గిరి ప్రదక్షిణ
స్టేషన్ మహబూబ్‌నగర్: అయోధ్యలో దివ్యమైన రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ జరిగిన ఏడాది పూర్తవుతున్న సందర్భంగా విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీన ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు పరిషత్ జిల్లా అధ్యక్షులు మద్ది యాదిరెడ్డి తెలిపారు. జిల్లాకేంద్రంలోని గణేష్ భవన్‌లో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 11వ తేదీన జిల్లాలోని కురుమూర్తిస్వామి దివ్యమైన క్షేత్రంలో గిరి ప్రదక్షిణ ఉంటుందన్నారు. వీహెచ్‌పీ ధార్మిక మండలి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. హిందు బంధువులు, ధార్మిక సంస్థలు, స్వామిజీలు, మహిళా మండలి సభ్యులు, భజన మండలి, యువత అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు. ఉదయం 10 గంటలకు దేవాలయం చుట్టూ గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుందని, భక్తులు 9 గంటల వరకు చేరుకోవాలన్నారు. అదేవిధంగా 11న జిల్లాలోని అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హనుమాన్ చాలీసా పారాయణాలు, భజనలు, సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. సమావేశంలో వీహెచ్‌పీ విభాగ్ కార్యదర్శి అద్దని నరేంద్ర, జిల్లా కార్యదర్శి నలిగేశి లక్ష్మినారాయణ, రాచాల జనార్దన్, హన్మంతు పాల్గొన్నారు.
రక్తదానం
మానవతకు దర్పణం
స్టేషన్ మహబూబ్‌నగర్: రక్తదానం మానవతకు దర్పణమని ఆర్‌టీఓ రఘుకుమార్ అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో బుధవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. శిబిరాన్ని ఆర్‌టీఓ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనం ఇచ్చే రక్తంతో అత్యవసర సమయాల్లో ఒకరి ప్రాణాలు కాపాడిన వారమవుతామని అన్నారు. శిబిరంలో 38 మంది రక్తదానం చేసినట్లు డిపో అధికారులు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా రెడ్‌క్రాస్ చైర్మన్ లయన్ నటరాజ్, డిప్యూటీ రీజినల్ మేనేజర్లు లక్ష్మిధర్మ, శ్యామల, డిపో మేనేజర్ సుజాత, సూపర్ వైజర్లు తదితరులు పాల్గొన్నారు.
‘యంగ్ ఇండియాకే
బోల్’ పోస్టర్ల ఆవిష్కరణ
స్టేషన్ మహబూబ్‌నగర్: జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం యంగ్ ఇండియాకే బోల్ సీజన్–5 పోస్టర్లను యువజన కాంగ్రెస్ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మహ్మద్ అవేజ్ అహ్మద్ మాట్లాడుతూ ఆలిండియా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తిగల యువ ఐవైసీ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలని కోరారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై, దేశంలో సామాజిక న్యాయం కోసం అంబేడ్కర్ చేసిన కృషిపై 90 సెకండ్లతో కూడిన ఉపన్యాస వీడియోను అప్‌లోడ్ చేయాలని కోరారు. ప్రతిభ కనబరిచిన వారిని గుర్తించి బహుమతులు అందజేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సంధ్య, జిల్లా ప్రధాన కార్యదర్శులు సంజీవ్‌రెడ్డి, ఇంతియాజుద్దీన్, నాయకులు ఎండీ సల్మాన్, శ్రీకాంత్‌రెడ్డి, ముస్తాక్ అలీ, వంశీ, పవన్ కళ్యాణ్, శ్రీశైలం, గణేష్, కృష్ణ, నీలకంఠం, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment