ప్రైవేట్‌లో విధులు!
ప్రభుత్వ వైద్యులు..
మెరుగైన వైద్యం అంటూ సొంత ఆస్పత్రులకు రెఫర్
●
సర్వం కోల్పోయాం..
ఆర్థికస్థోమత లేకనే నా భార్యను గద్వాల జనరల్ ఆస్పత్రికి తీసుకెళ్లా. ముక్కులో కండ పెరిగిందని.. తీసేయాలని డాక్టర్ చెబితేనే ప్రైవేట్‌కు తీసుకెళ్లా. ఆపరేషన్ కని లోపలికి తీసుకెళ్లిన వాళ్లు.. సీరియస్‌గా ఉందంటూ.. ఆగమాగం చేసి నాతో సంతకం చేయించుకున్నారు. నేనిచ్చిన రూ.15 వేలు నాకిచ్చి.. వారే అంబులెన్స్ మాట్లాడి కర్నూలుకు పంపించారు. అక్కడ రెండు రోజులుగా చికిత్స పొంది చనిపోయింది. మాకు ముగ్గురు పిల్లలు. అందరూ చిన్నోళ్లే. సర్వం కోల్పో యాం. ఎలా బతకాలి. ఎవరూ స్పందిస్తలేరు. మాకు న్యాయం చేయాలి.
– జమ్మన్న, మృతిచెందిన కవిత భర్త
సొంత క్లినిక్‌లకు
రెఫర్ చేస్తే చర్యలు..
జనరల్ ఆస్పత్రిలో పనిచేస్తూ వైద్యులు సక్రమంగా సమయపాలన పాటించడంపై దృష్టి పెడుతాం. ఇక్కడ పనిచేస్తూ సొంత క్లినిక్‌లకు కేసులు రెఫర్ చేస్తున్నట్లు తెలిస్తే అలాంటి వారిపై చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స కోసం వచ్చిన రోగులను బయట ప్రైవేట్‌కు పంపించొద్దు. అలా రోగులను ఎవరైనా వైద్యుల సొంత క్లినిక్‌లను తరలించారని ఫిర్యాదు చేస్తే తప్పక చర్యలు తీసుకుంటాం.
– డాక్టర్ సంపత్‌కుమార్ సింగ్,
ఆస్పత్రి సూపరింటెండెంట్
● డుమ్మా కొట్టి క్లినిక్‌లలోనే ఓపీలు, శస్త్రచికిత్సలు
● ధనార్జనే ధ్యేయంగా ఆరోగ్యం పేరిట వ్యాపారం
● పేద రోగుల జీవితాలతో చెలగాటం
● చోద్యం చూస్తున్న ఉన్నతాధికారులు
జిల్లా జనరల్ ఆస్పత్రుల్లో వైద్యులు ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు విధులు నిర్వర్తించాల్సి ఉంది. ఉమ్మడి పాలమూరులోని మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, గద్వాల, వనపర్తి, నారాయణపేట జిల్లా ఆస్పత్రుల్లో కీలక విభాగాలకు చెందిన వైద్యులు పలువురు ప్రైవేట్ క్లినిక్‌లు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా పలు ప్రైవేట్ హాస్పిటళ్లలోనూ చికిత్సలు అందిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల రాకను బట్టి కొందరు మధ్యాహ్నం 12 గంటల తర్వాత, మరికొందరు అంతకంటే ముందుగానే పీజీ వైద్యులకు బాధ్యతలు అప్పగించి.. క్లినిక్‌ల బాట పడుతున్నట్లు రోగుల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఎక్కడెక్కడ.. ఎలా అంటే..
● వనపర్తి జనరల్ హాస్పిటల్‌లో గైనకాలజీ, పీడియాట్రిక్, జనరల్ సర్జన్ విభాగంలో పని చేస్తున్న వైద్యులు పలువురు కొత్త బస్టాండ్ సమీపంలో, వల్లభ్‌నగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యసేవలందిస్తున్నారు. ఒకరు సొంతంగా హాస్పిటల్ పెట్టి.. చికిత్సలు చేస్తున్నట్లు సమాచారం.
● మహబూబ్‌నగర్ జిల్లా జనరల్ ఆస్పత్రిలో ప్రధానంగా జనరల్ మెడిసిన్, గైనకాలజీ, పీడియాట్రిక్, జనరల్ సర్జన్, ఆర్థోపెడిక్ విభాగాలకు చెందిన పలువురు వైద్యులకు న్యూటౌన్, రాజేంద్రనగర్, సుభాష్‌నగర్, మెట్టుగడ్డ, పద్మావతికాలనీ, బోయపల్లి గేట్ తదితర ప్రాంతాల్లో సొంతంగా క్లినిక్‌లు ఏర్పాటు చేసుకుని.. ప్రైవేట్‌గా వైద్యసేవలందిస్తున్నారు.
HOSPITAL
HOSPITAL
పీజీ వైద్యులకు బాధ్యతలు అప్పగించి..
Comments
Please login to add a commentAdd a comment