జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జిల్లాలో వానాకాలం 2024–25 సీజన్‌లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లు సాఫీగా పూర్తి చేసినట్లు రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్‌రావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఐకేసీ ద్వారా 103, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా 70, డీసీఎంఎస్ ద్వారా 4 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మొత్తం 19,116 మంది రైతుల నుంచి 91,673.020 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేసినట్లు వివరించారు. ఇందులో దొడ్డురకం 29,252 మెట్రిక్ టన్నులు, సన్న రకం ధాన్యం 62,420 మెట్రిక్ టన్నులు ఉన్నట్లు తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యానికి రూ.212.68 కోట్ల ధర చెల్లించాల్సి ఉండగా.. ఇప్పటికే రూ.204.89 కోట్లు రైతుల ఖాతాలో జమ చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం సన్న రకం ధాన్యం కొనుగోలుకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ప్రకటించగా జిల్లాలో రూ.29.01 కోట్లకు రూ.19.77కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వివరించారు.
అదనపు కలెక్టర్ మోహన్‌రావు
Comments
Please login to add a commentAdd a comment