మెరుగైన వైద్యసేవలు అందిస్తాం
పాలమూరు: జనరల్ ఆస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ విజయేందిరబోయి అన్నారు. బుధవారం జనరల్ ఆస్పత్రిలో బుధవారం ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆస్పత్రిలో డ్రెయినేజీ, ఎలక్ట్రిక్ పనులు, స్పెషల్‌రూంలు, రోగులకు అందుతున్న సేవలపై సమీక్షించారు. ఈ సమావేశానికి ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో జనరల్ ఆస్పత్రిని ఉత్తమ ఆస్పత్రిగా తీర్చిదిద్దడానికి యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నామన్నారు. ఆస్పత్రిలో డ్రెయినేజీ, ఎలక్ట్రిక్ పనులకు టీఎస్‌ఎంఐడీసీ ఇంజినీరింగ్ అధికారులు పరిశీలించి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. శిథిలావస్థకు చేరిన పాత ఓవర్ హెడ్ ట్యాంక్ స్థానంలో కొత్త ట్యాంక్‌ను నిర్మించాలని మిషన్ భగీరథ ఇంజినీరింగ్ అధికారులను సూచించారు. ఆస్పత్రి ముందు పెరిగిన చెట్లను తొలగించేందుకు అనుమతి కోసం అటవీ శాఖ అధికారులకు లేఖ రాయాలన్నారు. స్పెషల్‌రూంలు రోగులకు అద్దెకు ఇచ్చేందుకు కమిటీలో నిర్ణయం తీసుకున్నారు. ఆ గదులకు రోజుకు రూ.500 నుంచి రూ.1000 వరకు రుసుము చెల్లించాలని నిర్ణయించారు. ఎంసీహెచ్ భవనంలో ఉన్న లిఫ్ట్‌కు మరమ్మతులు చేసి రోగులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. కొత్తగా నిర్మిస్తున్న బోధన ఆస్పత్రి భవనం త్వరగా నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న ఆరుగురు కార్డియాలజిస్టులు రోగులకు ఉచితంగా సేవలు అందిస్తారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డా.రాంమోహన్ తెలిపారు. సంక్రాంతి నుంచి రెండు గంటలు వారానికి ఒకరు చొప్పున అందుబాటులో ఉంటారన్నారు.
నూతన భవనం త్వరగా పూర్తిచేయాలి
బోధనాస్పత్రి నూతన భవనం త్వరగా పూర్తిచేయాలని ఎంపీ డీకే అరుణ అన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి రోగులు ఎక్కువగా వస్తుంటారని, ప్రతి పేదోడికి వైద్యం అందించాలన్నారు. జిల్లా జనరల్ ఆస్పత్రిని వచ్చే నాలుగేళ్లలో ఉత్తమ ఆస్పత్రిగా రూపొందించేందుకు కార్యాచరణ రూపొందించాలని అన్నారు. కేంద్రం, రాష్ట్రాల నిధులు వినియోగించుకోవాలని సూచించారు. సోలార్ లైటింగ్‌కు, అంబులెన్‌న్స్‌కు నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు.
ఉత్తమ ఆస్పత్రిగా తీర్చిదిద్దుతాం: కలెక్టర్
ప్రతి పేదోడికి వైద్యం అందించాలి:
ఎంపీ డీకే అరుణ
రూ.10లక్షల నిధులు అందిస్తా :
ఎమ్మెల్యే యెన్నం
ఐసీయూ, ఈఎన్‌టీ విభాగాలు ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment