స్మార్ట్ రోబోటిక్ స్ప్రేయర్..
పంటలకు పురుగు నివారణ మందుల పిచికారీకి కూలీల కొరత నేపథ్యంలో హన్మకొండకు చెందిన షాహిన్ హైస్కూల్‌కు చెందిన విద్యార్థి జస్వంత్ స్మార్ట్ రోబోటిక్ స్ప్రేయర్‌ను రూపొందించారు. దీన్ని మొబైల్ ఫోన్ ద్వారా ఆపరేట్ చేయవచ్చు. ఇందుకు ఫోన్‌లో ట్రు క్లౌడ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫోన్ కెమెరా ఆధారంగా పంట పొలంలో ఎక్కడైనా పురుగు నివారణ మందులను స్ప్రే చేసుకోవచ్చు. దీనివల్ల కూలీల కొరత తీరడంతో పాటు స్కిన్ కాన్సర్, బ్యాక్‌బోన్ తదితర అనారోగ్యం బారిన పడకుండా రక్షించుకోవచ్చు. ఈ పరికరం తయారీకి రూ.12వేల వ్యయం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment